Abn logo
Mar 10 2021 @ 16:19PM

ఈ కవలలు బోసినవ్వులతో అమ్మానాన్నలను చేరాలంటే....

ఎప్పుడైతే మా 8 ఏళ్ళ వయసు బిడ్డను పోగొట్టుకున్నామో అప్పుడే నా గుండె చెదిరిపోయింది. ఆ రోజంతా నేను తిండి, నిద్ర లేకుండా మంచం మీదే పడున్నాను. నా తొలిచూరు బిడ్డను కాపాడుకోలేకపోయాననే అపరాధ భావం నాకు పెద్ద భారంగా మారింది. అలా కాలం గడుస్తుండగా... మరో సంతానం కోసం ప్రయత్నించాలని నేను, నా భర్త నిర్ణయించుకున్నాం. కానీ, మా విషయంలో విధి ఎంతో క్రూరంగా మారింది.... అంటూ విషణ్ణ వదనంతో తన బాధను వెళ్ళగక్కింది పరిమళ.


సుదీర్ఘ కాలపు ప్రయత్నం అనంతరం పరిమళ కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఈ పిల్లల్ని భగవంతుని అనుగ్రహంగా భావించి ఆ జంట ఎంతో మురిసిపోయింది. కానీ, అంతలోనే అదొక పీడకలగా మారింది.


పిల్లలిద్దరూ నెలలు నిండక ముందే పుట్టడం వల్ల, పుట్టిన వెంటనే వారిని NICUకి తరలించారు. ఊపిరితిత్తులు పూర్తిగా ఏర్పడకపోవడంతో వారిలో శ్వాస సంబంధమైన సమస్యలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం పిల్లలు వెంటిలేటర్ల సహాయంతో శ్వాస అందుకుంటున్నారు. పరిస్థితిని గమనిస్తున్న డాక్టర్లు, ఆ పిల్లలు ఎక్కువ రోజుల పాటు NICUలో ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఆ పిల్లలిద్దరికీ చికిత్స నిమిత్తం రూ.10 లక్షలు ($ 13807.96) ఖర్చవుతాయి. అయితే, రవి, పరిమళ అంత ఖర్చును ఏ మాత్రం భరించే పరిస్థితుల్లో లేరు. తమ చాలీచాలని ఆదాయం కారణంగా, ఈ చికిత్స ప్రారంభంలోనే తమకున్నదంతా ఖర్చుపెట్టేశారు. ఇప్పుడు వారికి మిగిలిందల్లా అర్ధించడం... ప్రార్థించడం మాత్రమే.


"మొదటి సంతానాన్ని పోగొట్టుకున్న నాకు రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపట్టడం లేదు. ఇప్పుడు ఈ కవలపిల్లలు దూరమవుతారేమోనన్న ఊహే నా ప్రాణాన్ని కదిలించేస్తోంది. మేం చేసిన తప్పేంటి? తల్లిదండ్రులం కావాలనుకున్నాం... మా పిల్లలకి మాకంటే మంచి జీవితాన్నివ్వాలని మాత్రమే కోరుకున్నాం. కానీ, మా ఆర్థిక పరిస్థితి వల్ల ఆ సంతోషాన్ని ఏనాడూ అనుభవించలేదు..." అని భారమైన హృదయంతో తన వేదన చెప్పుకున్నాడు రవి.


క్షణాలు గడుస్తున్న కొద్దీ ఆ కవలల ఆరోగ్యం మరింత సంక్లిష్టంగా మారుతోంది. కానీ, ఉదార హృదయంతో మీరిచ్చే విరాళాల ద్వారా ఆ చిన్నారుల తలరాతను మీరు మార్చగలరు. ఆ పిల్లలు చక్కని వైద్యం పొంది త్వరితగతిన కోలుకుంటారు. ఆ చిన్నారులు బోసినవ్వులతో పరిమళ, రవి దంపతుల చేతుల్లోకి చేరేలా మీరంతా సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ తల్లిదండ్రులో తమ కన్న పేగుబంధాన్ని మనసారా ఆనందించేలా చెయ్యండి. పెద్ద మనస్సుతో విరాళమిచ్చి ఈ కవలలకు మంచి చికిత్స జరిగేలా చేయూతనివ్వండి.


డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement