Abn logo
May 6 2021 @ 00:51AM

దండం పెడతానయ్యా... మాస్కు వేసుకో..

సోమందేపల్లి(పెనుకొండ టౌన), మే 5: ‘రోజు రోజుకు కరోన మహమ్మారితో పలువురు మృత్యువాత పడుతున్నారు. నిర్లక్ష్యం వీడి మాస్కులు ఽధరించండి చేతులెత్తి మొక్కుతా’నని తహసీల్దార్‌ సురేష్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం తహసీల్దార్‌ ఆధ్వర్యంలో స్థానిక రాజశేఖర్‌రెడ్డి కూడలి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మాస్కులు లేనివారికి ఆయన విన్నూత్నంగా చేతులెత్తి మొక్కి మాస్కుధరించాలని కోరారు. అలాగే మాస్కులేనివారికి మాస్కులు అందించారు. 


Advertisement