ఆహ్లాదకరంగా భవానీసాగర్‌ : కలెక్టర్‌ వెంకట్రావ్‌

ABN , First Publish Date - 2021-07-24T04:53:33+05:30 IST

పాలమూరు సమీ పంలోని భవానీ సాగర్‌ చూపరులను ఆకట్టుకునే లా ఆహ్లాదకరంగా ఉందని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌ అన్నారు. ఇక్కడి వాతావరణం, ప్రకృతి ఎంతో బా గుందన్నారు.

ఆహ్లాదకరంగా భవానీసాగర్‌ : కలెక్టర్‌ వెంకట్రావ్‌
బృహత్‌ ప్రకృతివనంలో నాటేందుకు తెచ్చిన మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

 మహబూబ్‌నగర్‌, జూలై 23: పాలమూరు సమీ పంలోని భవానీ సాగర్‌ చూపరులను ఆకట్టుకునే లా ఆహ్లాదకరంగా ఉందని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌ అన్నారు. ఇక్కడి వాతావరణం, ప్రకృతి ఎంతో బా గుందన్నారు. కలెక్టర్‌ శుక్రవారం భవానీ సాగర్‌ను సందర్శించారు. కొద్దిసేపు అక్కడే గడిపారు. చెక్‌ డ్యామ్‌ నిండి, అలుగు పారుతుండటం, చుట్టూ మొక్కలు పచ్చగా కళకళలాడుతుండటం, హరిత హారం కింద నాటిన మొక్కలు పెరిగి పెద్దవి కావ డం చూసి ఆనందం వ్యక్తం చేశారు. చుట్టూ అడవి పచ్చగా ఉండటం, పక్షుల కిలకిలరావాలతో ఆహాలదంగా ఉందని చెప్పారు. అనంతరం కో యిలకొండ- మహబూబ్‌నగర్‌ రహదారిలో నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. వాటికి వేసిన రంగులను పరిశీలించారు.


బృహత్‌ ప్రకృతివనం తనిఖీ

మునిసిపాలిటీ పరిధిలోని వీరన్నపేటలో బృహత్‌ పకృతివనాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకృతి వనానికి కేటాయించిన స్థలం బాగుందని కితాబిచ్చారు. ఈ నెల 24న బృహత్‌ ప్రకృతి వనా లలో అధిక సంఖ్యలో మొక్కలు నాటనున్నందున అన్ని ఏర్పాట్లూ చేసుకోవాల న్నారు. వీరన్నపేట నుంచి డబుల్‌ బెడ్‌ రూమ్‌ వరకు ఉన్న బీటీ రహదారికి ఇరువైపులా అవె న్యూ ప్లాంటేషన్‌ కోసం తవ్వుతున్న గుంతలను, నాటేం దుకు తెచ్చిన మొక్కలను పరిశీలించారు. ఆరడుగుల మొక్కలు తేవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ శంకరాచారి పాల్గొన్నారు.


బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను చేపట్టాలి

హన్వాడ: అనువైన ప్రాంతాలలో బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను చేపట్టాలని జిల్ల్లా కలెక్టర్‌ వెంక ట్రావ్‌ సూచించారు. మండలంలోని మాదారం శివారులో ఏర్పాటు చేయనున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను శుక్రవారం తనిఖీ చేశారు. కూలీలతో మాట్లాడారు. రెండు వారాల నుంచి డబ్బులు రావడం లేదని కూలీలు తెలిపారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనం కోసం గొండ్యాలలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌డీవో యాదయ్య, ఎంపీడీవో, తహసీల్దార్‌ ఉన్నారు.

Updated Date - 2021-07-24T04:53:33+05:30 IST