క్రీడా మైదానాలు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2022-05-26T04:27:28+05:30 IST

క్రీడా మైదానాలు సిద్ధం చేయాలి

క్రీడా మైదానాలు సిద్ధం చేయాలి
మన్నెగూడలో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల

పూడూరు/ఘట్‌కేసర్‌ రూరల్‌, మే25: క్రీడాపోటీల కోసం మైదానాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ నిఖిల ఆదేశించారు.  బుధవారం పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ, మీర్జాపూర్‌ గ్రామాల్లో ప్రభుత్వం క్రీడాకారుల కోసం కేటాయించిన స్థలాలను ఆమె పరిశీలించారు. అనంతరం మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా కడుమూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో అవసరమైన డైనింగ్‌హాల్‌, కిచెన్‌షెడ్‌, ప్రహరీ నిర్మాణా పనులను చేపట్టి జూన్‌ 2లోపు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో కృష్ణన్‌, తహసీల్దార్‌ కిరణ్‌, ఎంపీడీవో ఉమాదేవి, డీఈరాజు, ప్రధానోపాధ్యాయుడు కృష్ణ, సర్పంచులు పాల్గొన్నారు. 

 పరిశీలించిన  మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌

 ప్రతిగ్రామంలో క్రీడామైదానాలు ఏర్పాటు చేయాలని   మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌ అధికారులను ఆదేశించారు. ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఎదులాబాద్‌, ప్రతా్‌పసింగారం, కాచవానిసింగారం గ్రామాల్లో బుధవారం అదనపు కలెక్టర్‌ పర్యటించి క్రీడామైదానాల కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు తగిన ప్రోత్సహకాలు అందించడానికే ప్రతిగ్రామంలో క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. త్వరలో అన్ని గ్రామాల్లో క్రీడామైదానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో అరుణ, సర్పంచ్‌లు కొంతం వెంకట్‌రెడ్డి, వంగూరి శివశంకర్‌, ఎంపీవో నందకిషోర్‌, కార్యదర్శులు వేణుగోపాల్‌రెడ్డి, నరేష్‌, ఉషా, కాచవానిసింగార్‌ ఉపసర్పంచ్‌ చెట్టిపల్లి గీతాముత్యం పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T04:27:28+05:30 IST