‘ప్లేబాక్‌’ 2021 ఎలా షేర్‌ చేయాలంటే...

ABN , First Publish Date - 2021-12-18T05:30:00+05:30 IST

పాపులర్‌ సోషల్‌ మీడియా యాప్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’ ‘ప్లేబాక్‌’ పేరుతో ఇయర్‌ ఎండ్‌ సమాహారాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది.....

‘ప్లేబాక్‌’ 2021 ఎలా షేర్‌ చేయాలంటే...

పాపులర్‌ సోషల్‌ మీడియా యాప్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’ ‘ప్లేబాక్‌’ పేరుతో ఇయర్‌ ఎండ్‌ సమాహారాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. 2021లో యూజర్లు పోస్ట్‌ చేసిన 10 స్టోరీలను సంక్షిప్తంగా ఒక గుచ్చంగా అందిస్తుంది. కావాలనుకుంటే ఈ ‘ప్లేబాక్‌’ లిస్టులోని స్టోరీలను ఎడిట్‌ చేసుకోవచ్చు, వేరే స్టోరీలను చేర్చవచ్చు, లేదా అందులో నచ్చనివాటిని తీసివేసే అవకాశం కూడా ఉంటుంది. 


ప్లేబ్యాక్‌ లిస్ట్‌లోనే స్టోరీస్‌ ఆర్కైవ్‌ పాపప్‌ అవుతుంది. ప్లేబ్యాక్‌ రూపొందించుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు ఇన్విటేషన్‌ అందుతుంది. తద్వారా 2021 సంవత్సరానికి సంబంధించి స్టోరీల వీక్షణ లేదంటే షేర్‌ చేసుకోవచ్చు. 2021 స్టిక్కర్‌పై క్లిక్‌ చేసి వినియోగదారులు పని చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ ఫీడ్‌ టాప్‌లోనే మెసేజ్‌ కనిపిస్తుంది. ప్లేబ్యాక్‌ చెక్‌ చేసుకోండని చెబుతుంది. ప్లేబ్యాక్‌ కస్టమరైజేషన్‌ పేజీని ఎంటర్‌ చేసుకుని, ఆన్‌స్ర్కీన్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ మేరకు నడుచుకుని సొంతంగా ప్లేబ్యాక్‌ను  రూపొందించకోవాలి.  

Updated Date - 2021-12-18T05:30:00+05:30 IST