ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు

ABN , First Publish Date - 2021-02-27T05:46:49+05:30 IST

ఏజెన్సీలోని గ్రామాలను ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టినట్టు ప్రాజెక్టు అధికారి ప్రవీణ్‌ ఆదిత్య పేర్కొన్నారు.

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు

ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య 

రంపచోడవరం, ఫిబ్రవరి 26: ఏజెన్సీలోని గ్రామాలను ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టినట్టు ప్రాజెక్టు అధికారి ప్రవీణ్‌ ఆదిత్య పేర్కొన్నారు. శుక్రవారం మారేడుమిల్లి, రంపచోడవరం మండలాల్లోని పలు పర్యాటక ప్రదేశాల్లో ఆయనతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శ్రమదానం చేసి ప్లాస్టిక్‌ కవర్లు, చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రతీనెలా రెండు లేదా మూడవ శుక్రవారాల్లో  శ్రమదానం నిర్వహిస్తామన్నారు. రంపచోడవరం, మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాల్లో 9 ప్రదేశాలను గుర్తించి ఒక్కో పాయింట్‌కు ఒక్కో సెక్టార్‌ అధికారిని నియమించినట్టు తెలిపారు. ఏజెన్సీ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శీనానాయక్‌, ఏపీవో పీవీఎస్‌ నాయుడు, ఏవోలు డీఎన్వీ రమణ, సావిత్రి, జీసీసీ డీఎం ఎం.జగన్నాఽథరెడ్డి, డీఎల్పీవో ఎన్‌.హరినాఽథ్‌బాబు, ఈఈ శ్రీనివాసరావు, తహశీల్దారు కె.లక్ష్మీకళ్యాణి, డీఎల్పీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ కామేశ్వరి, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:46:49+05:30 IST