ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా ఆత్మకూరు

ABN , First Publish Date - 2022-07-02T03:17:25+05:30 IST

ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా ఆత్మకూరును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. రమేష్‌బా

ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా ఆత్మకూరు
మాట్లాడుతున్న కమిషనర్‌ రమేష్‌బాబు

- కమిషనర్‌ రమేష్‌బాబు

ఆత్మకూరు, జూలై 1: ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా ఆత్మకూరును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. రమేష్‌బాబు కోరారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం వ్యాపారులు, దుకాణాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్‌ నిషేధంపై అధికారులు పట్టణంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వ్యాపారులు, దుకాణాదారులు సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను విక్రయించినా, వాడినా చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-07-02T03:17:25+05:30 IST