ప్లాస్మా దానంపై పాటను విడుదల చేసిన రాజ్యసభ ఎంపీ సంతోష్

ABN , First Publish Date - 2020-10-13T21:44:38+05:30 IST

కోవిడ్‌-19 నియంత్రణలో భాగంగా ప్లాస్మా చికిత్స సత్ఫలితాలను ఫలితాలను ఇస్తున్న నేపథ్యంలో అందరూ ప్లాస్మా దానంపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.

ప్లాస్మా దానంపై పాటను విడుదల చేసిన రాజ్యసభ ఎంపీ సంతోష్

హైదరాబాద్: కోవిడ్‌-19 నియంత్రణలో భాగంగా ప్లాస్మా చికిత్స సత్ఫలితాలను ఫలితాలను ఇస్తున్న నేపథ్యంలో అందరూ ప్లాస్మా దానంపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. సైబరాబాద్ సీపీ సజ్జనార్ దీనిపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి వారితో కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా ప్లాస్మా డొనేషన్‌పై ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ ఆయనకు మొక్కను బహుకరించారు. కమిషనరేట్ ఆవరణలో మొక్కను నాటారు. సినీ దర్శకులు వీవీ వినాయక్, నిర్మాత సి. కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 




కల్యాణ్ చక్రవర్తి రాసిన ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు సమకూర్చగా.. శ్రీరామ్, సాకేత్ పాడారు. కార్యక్రమంలో శ్రీరామ్, సాకేత్‌లను ఎంపీ సంతోష్ కుమార్ సత్కరించారు. ప్లాస్మా దాతలు ముందుకు రావాలని.. ప్రాణదాతలుగా నిలవాలని సంతోష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతవ్వాలని అభిలషించారు. సీపీ సజ్జనార్ కృషిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-10-13T21:44:38+05:30 IST