Abn logo
Apr 21 2021 @ 23:54PM

మహిళ నాల్గోసారి ప్లాస్మాదానం

నెల్లూరు (వైద్యం), ఏప్రిల్‌ 21 : కరోనాతో బాధపడుతున్న సాటి వారు కోలుకోవడం కోసం ఓ మహిళ మానవత్వంతో నాల్గోసారి ప్లాస్మాదానం చేసింది. నెల్లూరు సంతపేటకు చెందిన యామిని బుధవారం రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో ప్లాస్మా దానం చేసింది. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్లాస్మాదానానికి మహిళలు ముందుకు రావటం, అందునా నాలుగు సార్లు దానం చేయడం అభినందనీయమన్నారు. మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కమిటీ కోశాధికారి సురేష్‌ కుమార్‌ జైన్‌, సభ్యులు బయ్యా ప్రసాద్‌, యడవల్లి సురేష్‌, రక్తనిధి కన్వీనర్‌ అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement