గాలిని శుభ్రపరిచే మొక్కలివి!

ABN , First Publish Date - 2021-05-17T05:51:45+05:30 IST

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అవసరం. కానీ ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అంటే కష్టమే! అయితే ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ద్వారా చుట్టూ ఉన్న గాలిని ప్యూరిఫై చేసుకునే అవకాశం ఉంది...

గాలిని శుభ్రపరిచే మొక్కలివి!

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అవసరం. కానీ ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అంటే కష్టమే! అయితే ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ద్వారా చుట్టూ ఉన్న గాలిని ప్యూరిఫై చేసుకునే అవకాశం ఉంది. అలాంటి మొక్కలపై కొన్ని దశాబ్దాల క్రితమే డా. వెలివర్టిన్‌ అనే శాస్త్రవేత్త పరిశోధనలు నిర్వహించారు. నాసా సైతం ఆ మొక్కలకు అనుమతినిచ్చింది. 


ఆ ఎయిర్‌ప్యూరిఫైడ్‌ ప్లాంట్స్‌ విశేషాలు ఇవి...

మొక్కలు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. అయితే చాలా మొక్కలు పగలు మాత్రమే ఆక్సిజన్‌ను అందిస్తాయి. కానీ ఎయిర్‌ప్యూరిఫైడ్‌ మొక్కలు సూర్యరశ్మితో సంబంధం లేకుండా 24 గంటలు ఆక్సిజన్‌ను అందిస్తాయి. రాత్రుళ్లు కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఇవి పూర్తిగా ఇండోర్‌లో పెరుగుతాయి. నిర్వహణ కూడా తక్కువ. బెడ్‌రూమ్‌లో, కిటికీల దగ్గర, మెట్లపైన, లివింగ్‌రూమ్‌లో పెంచుకోవచ్చు. అన్ని నర్సరీల్లో దొరుకుతాయి. ధర రూ. 150 నుంచి రూ. 500లోపు దొరుకుతాయి. 

1) జడ్‌జడ్‌ ప్లాంట్‌ 

ఇది కంప్లీట్‌ ఇండోర్‌ ప్లాంట్‌. ట్రాఫిక్‌ పొల్యూషన్‌ నుంచి వచ్చే జిలైన్‌, థైలైన్‌, షెమికల్స్‌ అనే బ్యాక్టీరియాను నిర్మూలించడంలో ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. వారానికోసారి నీళ్లు పోస్తే చాలు. వంద చదరపు అడుగుల్లో రెండు మొక్కలు పెంచుకోవాలి. డబల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ 1000 చదరపు అడుగులు అనుకుంటే 20 మొక్కలు పెంచుకుంటే సరిపోతుంది. 

2) రబ్బర్‌ ప్లాంట్‌

ఇది ఫర్నిచర్‌ నుంచి వచ్చే డస్ట్‌, డిటర్జంట్స్‌ నుంచి వచ్చే కెమికల్స్‌ను నిర్మూలిస్తుంది. కుక్కలు, ఇతర పెట్స్‌ నుంచి వచ్చే బ్యాక్టీరియాను క్యాచ్‌ చేస్తుంది. కలర్స్‌ నుంచి వచ్చే హానికరమైన రసాయనాలను తొలగిస్తుంది. ఇంట్లో పెట్స్‌ ఉన్న వారు ఈ మొక్కను తప్పక పెంచుకోవాలి.

3) పీస్‌ లిల్లీ

ఇది ఇంట్లో పుస్తకాలు ఉంచే ప్రదేశాల్లో, లైబ్రరీలో పెంచుకోవాల్సిన మొక్క. బుక్స్‌  దగ్గర పేరుకుపోయే డస్‌ను క్యాచ్‌ చేస్తుంది. ఇంట్లోకి ఎలివేషన్‌ వచ్చే ప్రదేశాల్లో అంటే కిటికీల దగ్గర పెంచుకోవచ్చు. కరెన్స్‌ దగ్గర పెట్టుకోవచ్చు. చెదలు రాకుండా కాపాడుతుంది. 

4) స్నేక్‌ ప్లాంట్‌ (మదరిల్లా టాంగ్‌ ప్లాంట్‌)

చాలామంది ఇళ్లలో, గార్డెన్‌లలో కనిపించే మొక్క ఇది. బెంజిన్‌ లాంటి హానికర రసాయలను ఈ మొక్క నిర్మూలిస్తుంది. రెండు వారాలకోసారి నీళ్లు లేదా నెలకోసారి నీళ్లు అందించినా సరిపోతుంది.

- కె.పి. రావు

ప్రముఖ ల్యాండ్‌స్కేప్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌

ఫోన్‌ : 8019411199

Updated Date - 2021-05-17T05:51:45+05:30 IST