మొక్కలు నాటి సంరక్షించాలి

ABN , First Publish Date - 2022-08-11T05:51:02+05:30 IST

మొక్కలు నాటి సంరక్షించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని 1వ వార్డు లో ఆజాదీకా అమృత్‌ మహోత్సవం, 75 స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్‌ పార్కులో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణతో కలిసి బుధవారం మొక్కలు నాటారు. ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు.

మొక్కలు నాటి సంరక్షించాలి
మొక్కకు నీరుపోస్తున్న రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌


సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 10: మొక్కలు నాటి సంరక్షించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని 1వ వార్డు లో ఆజాదీకా అమృత్‌ మహోత్సవం, 75 స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్‌ పార్కులో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణతో కలిసి బుధవారం మొక్కలు నాటారు. ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు వేములకొండ పద్మ, చింతలపాటి భరత్‌ మహాజన్‌, రాపర్తి శ్రీనివా్‌సగౌడ్‌, మెప్మా పీడీ రమేష్‌, మునిసిపల్‌ డీఈ సత్యారా వు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మొక్కలు నాటారు. పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో ము నిసిపాలిటీలు, అన్ని మండలాల్లో నేడు ఫ్రీడం రన్‌ నిర్వహిస్తామన్నా రు. ఈ నెల 12వ తేదీన రక్షాబంధన్‌, 13వ తేదీన గ్రామపంచాయతీ, కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ, 14వ తేదీన కళాప్రదర్శన, 16వ తేదీన జాతీయ గీతాలాపన, 17వ తేదీన రక్తదానం, 18వ తేదీన క్రీడల నిర్వహణ, 21వ తేదీన అమరవీరులకు నివాళులర్పించే కార్య క్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్‌ పాల్గొన్నారు. 


మొక్కల సంరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్‌ 

మొక్కల సంరక్షణ బాధ్యత అందరిదని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ అన్నారు. అజాదికా అమృత్‌, 75స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్‌ ఆవరణనలో మొక్కలు నాటారు. జిల్లాలో ఇరిగేషన్‌, విద్యా, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖలతో పాటు మునిసిపాలిటీలకు 3లక్షల మొక్కలు నాటే బాధ్యత ఇచ్చామని తెలిపారు. జిల్లాలో అటవీ శాతం మరింత పెంచాలని, మొక్కల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని పార్కులలో 75ఆకృతులలో ఫ్రీడ మ్‌ పార్కులను సిద్ధం చేయాలని, ప్రజాప్రతినిధులను భాగస్వాముల ను చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎ్‌ఫవో ముకుందరెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఎస్పీ నాగభూషణం, పీడీ కిరణ్‌కుమార్‌, డీఎవో రామారావునాయక్‌, డీహెచ్‌వో శ్రీధర్‌గౌడ్‌, జిల్లా సంక్షేమ అధికారులు అనసూర్య, జ్యోతిపద్మ, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:51:02+05:30 IST