మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలి : జడ్పీ సీఈవో

ABN , First Publish Date - 2021-06-18T06:56:21+05:30 IST

మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి అన్నారు.

మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలి : జడ్పీ సీఈవో
దేవరకొండ : కొమ్మెపల్లిలో నర్సరీ మొక్కలు పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి

దేవరకొండ / నల్లగొండ రూరల్‌, జూన17 : మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి అన్నారు. గురువారం ఆయన దేవరకొండ మండలంలోని కొమ్మెపల్లి గ్రామంలో వర్మీకంపోస్టు షెడ్డు, శ్మశానవాటిక, పల్లె ప్రకృతివనం, నర్సరీలు పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభమైనందున రికార్డుస్థాయిలో మొక్కలు నాటాలని కోరారు. పల్లె ప్రగతిలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాసరావు, కొమ్మెపల్లి సర్పంచ లోకసాని రజినిశ్రీధర్‌రెడ్డి, ఉప సర్పంచ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి సైదులు, అధికారులు పాల్గొన్నారు. నల్లగొండ మండలంలోని జీచెన్నారం గ్రామంలో పల్లె పకృతి వనాలు, నర్సరీలను జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి ఎంపీడీవో శ్రీనివా్‌సరెడ్డితో కలిసి పరిశీలించారు. అందుకు సంబంధించిన నిధుల వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. అన్నెపర్తి గ్రామంలో నర్సరీలు, పల్లె ప్రకృతి  వనాలను, డంపింగ్‌ యార్డులు, కంపోస్టు షెడ్లను డీపీవో విష్ణువర్ధనరెడ్డి తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలతో  గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో మాధవరెడ్డి, సర్పంచలు ఉప్పునూతల వెంకన్నయాదవ్‌, మేకల అరవింద్‌రెడ్డి, ఏపీవో ఆర్‌.గోపాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సరిత, విజయ పాల్గొన్నారు.
కనగల్‌ : రహదారుల వెంట మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని డీఆర్‌డీఓ పీడీ కాళిందిని ఆదేశించారు. గురువారం ఆమె దర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల్లో  వన నర్స రీ, వైకుంఠదామం, కోతుల ఆహారశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా పీడీ మాట్లాడుతూ ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ప్ర స్తుతం వర్షాలు కురుస్తున్నందున రహదారుల వెంట మొక్కలు నాటాలని సూచించారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలన్నారు. జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి కనగల్‌ గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి పనులు పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీవో ముజీబుద్దీన, ఏపీవో సుధాకర్‌, కార్యదర్శులు భాగ్యమ్మ, సంతో్‌షరెడ్డి, ఆయా సర్పంచలు అంజమ్మ, సునీతాకృష్ణయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T06:56:21+05:30 IST