పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ABN , First Publish Date - 2020-06-06T10:43:48+05:30 IST

పర్యావరణాన్ని పరిరక్షించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

మొక్కలు నాటి సంరక్షించాలి

అధికారులు, ప్రజాప్రతినిధుల పిలుపు


నెట్‌వర్క్‌: పర్యావరణాన్ని పరిరక్షించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇరు జిల్లాల్లో పలు చోట్ల మొక్కలు నాటారు.


 మొక్కల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ ఎంవి. రెడ్డి అన్నారు. శుక్రవారం డీఅర్‌డీవో కార్యాలయ సమావేశమందిరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సీతా లక్ష్మీ జిల్లా కలెక్టర్‌కు మొక్కను బహూకరించారు. మునిసిపల్‌ కార్యాలయ ఆవరణంలో జిల్లాకలెక్టర్‌ ఎంవి. రెడ్డి మొక్కలు నాటేందుకు తీస్తున్న గుంతలను పరిశీలించి సలహాలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌రాజు, మునిసిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, పట్టణప్ర గతి ప్రత్యేకాధికారి కృపాకర్‌రావు పాల్గొన్నారు.


సింగరేణి ప్రధాన కార్యాలయ ఆవరణలో ప్రపంచ ప ర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం (ఎంపీ) కేవీ. రమణమూరి, జీ ఎం (పర్సనల్‌ ఆర్‌సీ ఐఆర్‌ అండ్‌ పీఎం) ఎ. ఆనం దరావు, సీఎంఓఏఐ ప్రతినిధి రాజీవ్‌ కుమార్‌, టీబీజీకేఎస్‌ కార్పొరేట్‌ ఉపాధ్యక్షుడు సోమిరెడ్డిలు హా జరయ్యారు. డీజీ ఎం (పర్సనల్‌) డి. సాల్మన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కా ర్యక్రమంలో డిప్యూటీ ఎంజీఆర్‌ ఎన్విరా న్మెంట్‌ రవి కిరణ్‌ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు అనం తరం సీనియర్‌ పీవో బేతిరాజు హెడ్డాఫీసులోని అధికా రులు, సిబ్బందితో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయిం చారు.  


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఇల్లెందు ఏరియా సింగరేణిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక జీఎం కార్యాలయంలో అధికారులు, సిబ్బంది పర్యావరణ ప్రతిజ్ఙ చేశారు. కార్యక్రమంలో  జీఎం సత్యనారాయణ, ఎస్‌వోటుజీఎం మల్లెల సుబ్బారా వు, పర్యావరణ అధికారి సైదులు, డీజీఎం నరసింహరావు పాల్గొన్నారు. పర్యావరణ సమతౌల్యంతోనే ప్రాణికోటి మనుగడ ఆధారపడి ఉందని ఆర్యవైశ్య మహాసభ సౌత్‌ఇండియా సెక్రటరీ కూరశ్రీధర్‌ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణదినోత్సవాన్ని పరుస్కరించుకుని కొత్తగూడెం పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రామాలయం, లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో కూరశ్రీధర్‌ మొక్కలు నాటారు. విభిన్నప్రతిభా వంతుల సంఘం ఆఽధ్వర్యంలో మొక్కలు నాటారు. కా ర్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గుండపనేని సతీష్‌, నగే ష్‌, ఖాదర్‌బాబా, హుస్సేన్‌, చాంద్‌పాషా, శ్రీను పాల్గొన్నారు.


మానవాళి మనుగడకు చెట్లే ఆధారమని డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మల్లవరంలో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు.  కార్యక్రమంలో ఎంఈవో ఎన్‌.దామోదర్‌ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, డీపీఎం రాయల శ్రీనివాసరావు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గుడిపల్లి నారాయణ, గౌరవాధ్యక్షుడు దుగ్గిదేవర అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తల్లాడలో ప్రెస్‌క్లబ్‌, మదర్‌థెరిస్సా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌ పొట్టేటి సంధ్యారాణి, ఎస్‌ఐ బి.తిరుపతిరెడ్డి మొక్కలు నాటారు. 


మానవులకు మనుగడనిచ్చే ప్రకృతిమాతను కాపాడుకుందామని అటవీశాఖ అధికారి ఏ.వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. 


అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే రాములునాయక్‌ పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ధార్న రాజశేఖర్‌ పాల్గొన్నారు. వైరాలోని తమ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ పలువురు బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. 25మందికి రూ.4.80లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందించారు. 


ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాల్వంచలోని కేటీపీ ఎస్‌ 5,6దశల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కర్మాగారం ఆవరణలోని కోల్‌ప్లాం ట్‌, సైలో ఏరియాల్లో 5,6దశల చీఫ్‌ ఇంజనీర్‌ కే రవీందర్‌కుమార్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు సంజీవయ్య, వర ప్రసాద్‌, కృష్ణ, ఆరుద్ర, అనిల్‌కుమార్‌, ఎస్‌ఏవో రామారావు, ఎస్‌పీఎఫ్‌ సీఐ మండల రాజు పాల్గొన్నారు.


పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని కన్జర్వేవేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌) పీవీ. రాజారావు అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని ఇల్లందు క్రాస్‌ రోడ్‌ సమీపంలో ఉన్న సెంట్రల్‌ పార్క్‌లో బయోడైవర్సిటీ పార్క్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి లక్ష్మణ్‌ రంజిత్‌ నాయక్‌, మహబూబాబాద్‌ జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణమాచారి, ఎఫ్‌బీవోలు అప్పయ్య, దామోదర్‌రెడ్డి, తిరుమలరావు, వేణుబాబు, భూక్యా అనిల్‌ పాల్గొన్నారు.


ప్రతి గ్రామపంచాయతీల్లో ఈనెల చివరికల్లా నర్సీలలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచాలని అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని పోలారం, తిలక్‌నగర్‌, విజయలక్ష్మినగర్‌, కొమారారం గ్రామపంచాయతీల్లో పెంచుతున్న నర్సీలను ఆయన పరిశీలించారు కార్యక్రమంలో ఎంపిపి చీమలనాగరత్నమ్మ, ఎంపీడీవో వివేక్‌రావు, సర్పంచ్‌లు సరోజని, కవిత, స్రవంతి పాల్గొన్నారు.


Updated Date - 2020-06-06T10:43:48+05:30 IST