వనమహోత్సవంలో నాటిన మొక్కలు

ABN , First Publish Date - 2022-08-11T06:06:39+05:30 IST

మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా కొనసాగుతున్నాయి. ఫ్రీడం పార్కులను ప్రారంభించి వనమహోత్సవాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా మొక్కలను నాటారు. పలు చోట్ల ర్యాలీలు నిర్వహించి జెండాలను పంపిణీ చేశారు.

వనమహోత్సవంలో నాటిన మొక్కలు
పుల్కల్‌లో వేప మొక్కను నాటుతున్న సంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ

మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా కొనసాగుతున్నాయి. ఫ్రీడం పార్కులను ప్రారంభించి వనమహోత్సవాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా మొక్కలను నాటారు. పలు చోట్ల ర్యాలీలు నిర్వహించి జెండాలను పంపిణీ చేశారు. 


సంగారెడ్డి జిల్లాలో.. 

పుల్కల్‌/పటాన్‌చెరు/జిన్నారం/సంగారెడ్డి రూరల్‌/కంది/సదాశివపేట/మునిపల్లి/నారాయణఖేడ్‌/కల్హేర్‌/మనూరు : పుల్కల్‌ ఎంపీడీవో కార్యాలయ ఆవరణ, బస్వాపూర్‌లోని ఫ్రీడం పార్కులలో జడ్పీ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజుశ్రీజైపాల్‌రెడ్డి మొక్కలను నాటారు. పటాన్‌చెరు పట్టణంలోని కృషి డిఫెన్స్‌కాలనీలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కులో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ మెట్టుకుమార్‌యాదవ్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమీషనర్‌ బాలయ్యతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మొక్కలను నాటారు. మునిపల్లి మండలం కంకోల్‌ ఎస్సీ బాలుర హాస్టల్‌ను ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి వజ్రోత్సవ సంబురాల్లో భాగంగా విద్యార్థులతో మొక్కలను నాటించారు. వట్‌పల్లి మండలం పోతులబొగుడ ఆదర్శ పాఠశాలలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ విద్యార్థులతో కలసి 75 మొక్కలను నాటారు. నారాయణఖేడ్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణతో పాటు రాజీవ్‌ చౌక్‌ ప్రాంతంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఫ్రీడమ్‌పార్కులను ప్రారంభించారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ రాయికోడ్‌ మండలంలోని హస్నాబాద్‌ గ్రామం నుంచి రాయికోడ్‌కు సుమారు పదిహేను కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఖేడ్‌ పట్టణ శివార్లలోని అర్బన్‌ పార్కులో మొక్కలను నాటారు. కల్హేర్‌ మండల పరిధిలోని నాగ్‌ధర్‌, బాచేపల్లి గ్రామాల్లోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కులను నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రారంభించి మొక్కలు నాటారు. సంగారెడ్డి బైపాస్‌ రోడ్డులోని మండల సమాఖ్య కార్యాలయంలో డీఆర్డీవో శ్రీనివా్‌సరావు మొక్కలను నాటారు. కందిలోని పీఏసీఎస్‌ ఆవరణలో చైర్మన్‌ దొడ్ల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి తుమ్మ ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఆవరణలో 75 మొక్కలను నాటారు. సదాశివపేట పట్టణంలో సీఐ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించి అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలను నాటారు. చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ జి.నర్సింహ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పట్టుకుని వందేమాతం అంటూ నినాదాలు చేశారు. సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్‌ సందీ్‌పరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు 75 మొక్కలను నాటారు. బొల్లారంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి, సీఐ సురేందర్‌రెడ్డి, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, కౌన్సిలర్‌ చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డిలు జాతీయ జెండాలు పంపిణీ చేసి ఫ్రీడం పార్కును ప్రారంభించారు. జిన్నారంలో పాఠశాల విద్యార్థులతో కలిసి ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌, విద్యార్థుల ర్యాలీలో పాల్గొన్నారు. నారాయణఖేడ్‌ మండల పరిధిలోని తుర్కపల్లిలో 75 ఆకారం కనిపించే విధంగా మొక్కలు నాటారు. రుద్రారం ప్రాథమీకోన్నత పాఠశాలలో విద్యార్థులకు దేశభక్తి గీతాల పోటీలను నిర్వహించారు.  మండల పరిధిలోని మనూరు ఉన్నత పాఠశాలలో ఫ్రీడమ్‌ పార్కును ఏర్పాటు చేసి 200 మొక్కలను నాటారు. 


మెదక్‌ జిల్లాలో

మెదక్‌ మున్సిపాలిటీ/మెదక్‌ అర్బన్‌/నర్సాపూర్‌/ హత్నూర/చిన్నశంకరంపేట/తూప్రాన్‌/తూప్రాన్‌రూరల్‌/తూప్రాన్‌రూరల్‌ /మాసాయిపేట/వెల్దుర్తి/అల్లాదుర్గం/శివ్వంపేట : మెదక్‌ పట్టణంలోని ఆరు వార్డులో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్‌ పార్కును అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సందర్శించి మున్సిపల్‌ ఛైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ ఛైర్మన్‌ మల్లికార్జున్‌ గౌడ్‌, జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామితో కలిసి మొక్కలను నాటి నీరు పోశారు. మెదక్‌ పట్టణంలోని సబ్‌జైల్‌లో పర్యవేక్షణ అధికారి సుధాకర్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో డీఈవో రమే్‌షకుమార్‌, డీఎస్పీ సైదులు, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఇంటింటికి జాతీయ పతకాల పంపిణీ చేపట్టారు. సిద్ధార్థ్‌ జూనియర్‌ కళాశాలలో కళాశాల చైర్మన్‌ శ్రీనివాస్‌ చౌదరి ఆధ్వర్యంలో వనమహోత్సవం ఘనంగా నిర్వహించారు.  మనోహరాబాద్‌ మండల కూచారంలోని తూప్రాన్‌ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ మొక్కలను నాటారు. నర్సాపూర్‌ సమీపంలోని అర్బన్‌పార్కులో అటవీశాఖ ఆధ్వర్యంలో 750 మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అటవీశాఖ సీసీఎఫ్‌ శర్వానన్‌, డీఎ్‌ఫవో రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. మెదక్‌ జిల్లాలో 19 ప్రీడమ్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు సీసీఎఫ్‌ తెలిపారు. హత్నూర, చందాపూర్‌ గ్రామాలలో నిర్వహించిన స్వాతంత్ర వజ్రోత్సవాలలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాలు పంపిణీ చేసి మొక్కలను నాటారు. నర్సాపూర్‌ మార్కెట్‌యార్డులో ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనుసూయఅశోక్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.   చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం ఆవరణలోని 75 వసంతాల ఆకారంలో తీరొక్క పూల మొక్కలను నాటారు. తూప్రాన్‌ పట్టణంలో పాత హైటెక్‌ దాబా హోటల్‌ వద్ద అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టగా మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తూప్రాన్‌రూరల్‌ పరిధిలోని ఇస్లాంపూర్‌లో ఫ్రీడం పార్కులో భారతదేశం పటం ఆకారంలో మొక్కలు నాటి జాతీయ జెండాలను ప్రదర్శించారు. మాసాయిపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో వజ్రోత్సవ ర్యాలీని నిర్వహించారు. మాసాయిపేటలో వివిధ సంఘాలకు, ప్రజలకు పెద్ద ఎత్తున జెండాలను పంపిణీ చేశారు. అల్లాదుర్గం, తూప్రాన్‌లో విద్యార్థులు గాంధీ సినిమాను వీక్షించారు. శివ్వంపేట మండలం అల్లీపూర్‌ రూప్లాతండాలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేగుంటలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీని నిర్వహించారు. నార్సింగిలోను తిరంగా ర్యాలీ నిర్వహించారు. 


జగ్గారెడ్డి పాదయాత్ర 

సదాశివపేట/సదాశివపేట రూరల్‌:  స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంలో 75 కిలోమీటర్ల మేర చేపట్టిన ఆజాది కా గౌరవ్‌ పాదయాత్ర రెండో రోజు బుధవారం సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్‌ వద్ద నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ముందుకు కొనసాగించారు. 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర సదాశివపేట మండల పరిధిలోని పెద్దాపురం గ్రామం వదరకు ముగిసింది. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యేతోపాటు పాల్గొన్న ఆయన సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి, కూతురు జయారెడ్డిలు ఉత్సాహంగా నడుస్తూ ప్రజల్లో, కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్‌ నింపారు.

రాయికోడ్‌ : మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ రాయికోడ్‌ మండలంలోని హస్నాబాద్‌ గ్రామం నుంచి రాయికోడ్‌కు సుమారు పదిహేను కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. 

Updated Date - 2022-08-11T06:06:39+05:30 IST