మొక్కలు నాటి.. సంరక్షణ మరచి...

ABN , First Publish Date - 2021-06-13T06:46:49+05:30 IST

పేదలకు ప్రభుత్వం అందజేసిన ఇళ్ల స్థలాల్లో పచ్చదనం జాడ కనిపించడం లేదు. ఎంతో ఉన్నతాశయంతో ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమంలో ఆర్భాటంగా చేపట్టిన మొక్కల పెంపకం అలంకార ప్రాయంగా మారింది.

మొక్కలు నాటి.. సంరక్షణ మరచి...
లేఔట్‌లో ఎండిపోయిన మొక్కలు

లేఔట్లలో జాడలేని పచ్చదనం


బొమ్మనహాళ్‌, జూన 12 : పేదలకు ప్రభుత్వం అందజేసిన ఇళ్ల స్థలాల్లో పచ్చదనం జాడ కనిపించడం లేదు. ఎంతో ఉన్నతాశయంతో ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమంలో ఆర్భాటంగా చేపట్టిన మొక్కల పెంపకం అలంకార ప్రాయంగా మారింది. నాటిన మొక్కలను పెంచడంలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో పచ్చతోరణం ఎండిపోయింది. ఉపాధి హామీ పథకం కింద నా టిన మొక్కలు అసలు కనిపించకపోవడం గమనార్హం. లక్షల రూపాయలు ఖర్చుచేసి పనులు చేసినా ఫలితం బూడిదలో పోసిన పన్నీరైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో 16 లేఔట్లు వేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటారు. జిల్లాలోనే పెన్నహోబిళం, విడపనక ల్లు ప్రాంతాల నర్సరీల నుంచి వేప, కానుగ, సుంకేశ మొక్కల ను తీసుకువచ్చి నాటారు. వీటిలో అధిక శాతం మొక్కలు ప్ర స్తుతం ఎండిపోవడంతో కొత్త మొక్కలు నాటాల్సిన పరిస్థితి ఎ దురవుతోంది.


ఉపాధిహామీ పనుల్లో భాగంగా మొక్కలు నాటిన కూలీలకు ఒక మొక్కకు గుంత తీస్తే రూ.37లు ఇచ్చారు. అయి తే వాటిని నిర్మించే కంచెకు అధికంగా ఇచ్చారు. గుంత తీసి మొక్క నాటి కంచె ఏర్పాటు చేసే వరకు రూ.2.60 లక్షలకు పై గా ఖర్చుచేశారు. 12 పంచాయతీల్లో 16 లేఔట్లు వేసి దాదాపు 2500 మొక్కలు నాటారు. నిధులు దుర్వినియోగం తప్ప ఎ లాంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్వహణ కోసం నిధులు ఖర్చుచేసి గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు అంటున్నా రు. వచ్చేది వర్షాకాలం కావడంతో ఇప్పటికైనా ఉన్నతాధికారుల పర్యవేక్షణ చేపట్టి మొక్కలు నాటి సంరక్షిస్తే పచ్చదనం సంతరించుకునే అవకాశాలున్నాయి. మొక్కలు నాటినప్పటి నుంచి వాటిని చూసుకునే బాధ్యత ఒక వాచర్‌మెనను ఏర్పాటు చేశా రు. వారికి వేతనాలు చెల్లించకపోవడంతో మొక్కలను సంరక్షిం చే బాధ్యత నుంచి తప్పుకున్నారని విమర్శలున్నాయి. మొక్కలు నాటి యేడాది గడుస్తున్నా మొక్కలు సంరక్షించే వాచర్‌మెనలకు వేతనాలు ఇవ్వలేదు. వారికి బిల్లులు రాకపోవడం వల్లే ప చ్చతోరణం ఎండిపోయిందనే విమర్శలున్నాయి. 


గతంలో ఒక మొక్క కూడా ఎండనీయలేదు:

మారుతీప్రసాద్‌, మాజీ సర్పంచ, ఉద్దేహాళ్‌ 

గతంలో సర్పంచగా వున్న సమయంలో ఉ ద్దేహాళ్‌ పంచాయతీలో వేలల్లో మొక్కలు నా టాం. ఒక మొక్కను కూడా ఎండనివ్వలేదు. నేడు లేఔట్లలో ఎంతో ఆర్భాటంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి ఒక మొక్కను కూడా బతకనివ్వలేదు. ప్రజాధనం దుర్వినియోగమైంది. 


కొత్త మొక్కలు నాటుతాం: రమేష్‌, ఏపీవో 

ఇళ్ల స్థలాల్లో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్క లు నాటుతాం. జూలై, ఆగస్టు మధ్య నాటేందుకు మొక్కలు సి ద్ధం చేస్తాం. వాటిని సంరక్షించే బాధ్యత పంచాయతీకే అప్పజె ప్పాం. బిల్లులు చేసే బాధ్యత మాదే. పెట్టిన బిల్లులకు నిధులు రాలేదు. వాచర్‌మెన, నీటిని పోసేవారికి బిల్లులు ఇవ్వలేదు.  

Updated Date - 2021-06-13T06:46:49+05:30 IST