మొక్కలను నాటడాన్ని నిర్బంధం చేయాలి

ABN , First Publish Date - 2021-08-06T05:18:24+05:30 IST

మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్బంధం చేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. కుశాలపురం పరిధిలోని శ్రీకాకుళం ప్రభు త్వ పాలిటె క్నిక్‌ కళాశాలలో గురువారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

మొక్కలను నాటడాన్ని నిర్బంధం చేయాలి
మొక్కకు నీరుపోస్తున్న స్పీకర్‌ సీతారాం

  స్పీకర్‌ తమ్మినేని సీతారాం 

ఎచ్చెర్ల, ఆగస్టు 5: మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్బంధం చేయాలని  స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. కుశాలపురం పరిధిలోని శ్రీకాకుళం ప్రభు త్వ పాలిటె క్నిక్‌ కళాశాలలో గురువారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్పీకర్‌ సీతారాం పాల్గొని మాట్లాడారు. నిర్బంధ ప్రాథమిక విద్య మాదిరిగా నిర్బంధ మొక్కల నాటే కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ఇంటి నిర్మాణానికి ప్లాన్‌ ఇచ్చేటప్పుడే మొక్కల నాటేందుకు వీలుగా ఒప్పందపత్రం తీసుకోవాలన్నారు. అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసే మాఫియాను నియంత్రించాల్సి ఉందన్నారు. వాతా వరణ సమతుల్యానికి ఉద్యమంలా మొక్కలను నాటాలని.. ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని స్పీకర్‌ పిలుపునిచ్చారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లఠ్కర్‌ మా ట్లాడుతూ, జిల్లాలో 58 లక్షల మొక్కలను నాటేందుకు సిద్ధం చేశామన్నారు. కార్యక్ర మంలో  ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌కుమార్‌, రెడ్డి శాంతి, స్క్వాడ్‌ డీఎఫ్‌వో సోమశేఖర్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.రాజేశ్వరి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

 సామాజిక బాధ్యత: ఎస్పీ

మొక్కలను నాటడాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ అన్నారు. ఎచ్చెర్ల సాయుధ పోలీసు మైదానంలో గురువారం ఆయన మొక్కలు నాటారు. అడిషనల్‌ ఎస్పీ (క్రైమ్‌) టీపీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు ఎం.మహేంద్ర, ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌, జి.శ్రీనివాసరావు, యూనిట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఎం.ప్రసన్నకుమార్‌, ఆర్‌ఐలు ప్రదీప్‌, ఉమామహేశ్వరరావు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

సీతంపేట: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నిర్మూలించాలని ఎమ్మెల్యే వి.కళావతి తెలిపారు. గురువారం చాకలి గూడ పంచాయతీ నారాయణగూడలో మొక్కలు నాటారు. అనంత రం 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన గ్రావిటేషన్‌ ఫ్లో పను లను ప్రారంభించారు. సవర రాము పాల్గొన్నారు. గుజరాతీపేట: మొక్కలను నాటి  పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని డీఈవో గార పగడాలమ్మ పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎలియన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా చైర్మన్‌ జామి చంద్రశేఖర్‌,  సోముబాబు-వ జ్రమ్మ చారిట బుల్‌ ట్రస్టు ప్రతినిధులు, హెచ్‌ఎం ఎం.వాగ్దేవి పాల్గొన్నారు.



 




Updated Date - 2021-08-06T05:18:24+05:30 IST