కోటి మొక్కల లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-13T05:05:21+05:30 IST

ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న హారితహరం ఏడో విడతకు ఖమ్మం జిల్లాలో నాటేందుకు మొక్కలు ప్రభుత్వ లక్ష్యాల మేరకు సిద్ధంగా ఉన్నాయి.

కోటి మొక్కల లక్ష్యం
నర్సరీలో పెరుగుతున్న మొక్కలు

 జిల్లాలో 100.67 లక్షల మొక్కలు సిద్ధం

  ఏడు ప్రభుత్వశాఖల ద్వారా నర్సరీల నిర్వహణ

  వర్షాల ప్రారంభంతో మొదలుకానున్న హారితహరం 

ఖమ్మం సంక్షేమవిభాగం, జూన్‌ 12: ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న హారితహరం ఏడో విడతకు ఖమ్మం జిల్లాలో నాటేందుకు మొక్కలు ప్రభుత్వ లక్ష్యాల మేరకు సిద్ధంగా ఉన్నాయి. గత వారం నుంచి వర్షాలు కురియటం, నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగి నాటేందుకు అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించినా మొక్కలు నాటేందుకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది.


కోటి మొక్కల లక్ష్యంగా.. ఖమ్మం 


ఇప్పటి వరకు ఆరు విడతలో ఖమ్మం జిల్లాలో తెలంగాణ హరితహరం మొక్కలు నాటే కార్యక్రమం దిగ్విజయంగా అధికారులు పూర్తి చేశారు. ఐదో విడత కార్యక్రమంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ప్రఽథమ స్థానం కైవసం చేసుకొంది. కాగా ఏడో విడతలో కోటి మొక్కల ఖమ్మం లక్ష్యంతో జిల్లాలోని ఏడు ప్రభుత్వ శాఖల ద్వారా ఇప్పటికే కోటికి పైగా మొక్కలను నర్సరీల్లో పెంచారు. వీటిలో ఈ సంవత్సరం మొక్కలు(రైజింగ్‌ ప్లాంట్స్‌) 85.74లక్షలు కాగా గత సంవత్సరకాలం నుంచి నర్సరీల్లో పెరిగి ఉన్న మొక్కలు(కన్వర్షన్‌ ప్లాంట్స్‌) 5.47లక్షలు, ఇక పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో నాటాల్సిన(మెయిన్‌టినెన్స్‌ ప్లాంట్స్‌) 9.46లక్షలు కాగా.. మొత్తం 100.67లక్షల మొక్కలను సిద్ధం చేశారు.


నాటేందుకు సిద్ధం


తెలంగాణ హరితహారం కార్యక్రమం ప్రతి సంవత్సరం జూన్‌ 15నుంచి 20వ తేదీ లోపుగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోను కోటి మొక్కలను నాటేందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, డీఆర్‌డీఏ, అటవీశాఖ, మున్సిపల్‌ శాఖల అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల నుంచి మొక్కలను కార్యాచరణ చేసి పంపిణీ చేసేందుకు సైతం అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ప్రభుత్వశాఖ   నాటాల్సిన మొక్కలు

అటవీశాఖ 14.20

డీఆర్‌డీఏ 10.00

ఉద్యానవన 3.00

ఆబ్కారీ 0.50

విద్యాశాఖ 0.50

సింగరేణి 1.50

పురపాలకం

ఖమ్మం 1.00

మధిర 0.43

వైరా 0.43

సత్తుపల్లి 0.44


Updated Date - 2021-06-13T05:05:21+05:30 IST