21న హరితహారం మొక్కలను నాటాలి

ABN , First Publish Date - 2022-08-18T06:13:43+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం నిర్వహించాలని, పెద్దఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కలెక్టర్‌ను ఆదేశించారు.

21న హరితహారం మొక్కలను నాటాలి
కలెక్టరేట్‌లో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

సిరిసిల్ల కలెక్టరేట్‌, అగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం నిర్వహించాలని,  పెద్దఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కలెక్టర్‌ను ఆదేశించారు.  కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్పరెన్స్‌లో   కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి,  అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌తోపాటు జిల్లా అధికారులతో  హైదరాబాద్‌  నుంచి మంత్రి మాట్లాడారు.  స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో భారీ స్థాయిలో మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేసే  విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ ఎనిమిదో విడత హరిహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 33లక్షల 70వేల మొక్కలను నాటాలనే లక్ష్యానికి ఇప్పటి వరకు 29లక్షల 90 వేల మొక్కలను నాటమన్నారు. 21వ తేదీన ఎనిమిదో విడత లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. అగస్టు 21న జిల్లా వ్యాప్తంగా 255 గ్రామపంచాయతీలు, రెండు మున్సిపాల్టీల్లో 3లక్షల 80 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామన్నారు. 

 కార్యాచరణను సిద్దం చేయాలి

వజ్రోత్సవాల్లో భాగంగా 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు 3లక్షల 80 వేల మొక్కలను నాటేందుకు కార్యాచరణను సిద్దం చేయాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో హరితహారంపై అధికారులతో సమీక్షించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లక్షా 90 వేల మొక్కలు, అటవీశాఖ లక్ష  మొక్కలు, వేములవాడ మున్సిపాల్టీలో 84 వేలు, సిరిసిల్ల మున్సిపాల్టీలో 31 వేల మొక్కలు, ప్రభుత్వ శాఖలన్నీ కలిపి మొత్తం 3లక్షల 80వేల మొక్కలను నాటాలన్నారు.  మొక్కలుగా నాటేందుకు వీలుగా గుంతలను తీసి సిద్ధం చేయాలన్నారు. నాటేందుకు వీలుగా అవసరమైన స్థలాలు, ట్రీ పార్క్‌లను గుర్తించాలన్నారు. ఏవెన్యూ ప్లాంటేషన్‌కు ఆరు ఫీట్లకు పైగా పెరిగిన మొక్కలను ఉపయోగించాలన్నారు. మున్సిపాల్టీల్లో ఏవెన్యూ ప్లాంటేషన్‌కు అవసరమైన పెద్ద మొక్కలను కొనుగోలు చేసి నాటించాలన్నారు. ఇంటింటికీ పంపణీ చేసేందుకు అవసరమైన మొక్కలను స్థానికంగానే సమాకుర్చుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా  వన మహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో  అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌,  జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవోలు రణధీర్‌రెడ్డి, సూర్యనారాయణ, డీఆర్డీవో మదన్‌మోహన్‌, డీపీవో రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌లు సమ్మయ్య, శ్యాంసుందర్‌రావు, అటవీ, ఎక్సైజ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.  సమావేశంలో అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌,  జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవోలు రణధీర్‌రెడ్డి, సూర్యనారాయణ, డీఆర్డీవో మదన్‌మోహన్‌, డీపీవో రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌లు సమ్మయ్య, శ్యాంసుందర్‌రావు, అటవీ, ఎక్సైజ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T06:13:43+05:30 IST