పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-07-16T09:47:12+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను అభివృద్ధి చేయాలని ఎంపీ పసునూరి దయాకర్‌ అధికారులకు సూచించారు. హన్మకొండలోని కలెక్టరేట్‌లో

పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి

ఎంపీ పసునూరి దయాకర్‌


వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, జూలై 15: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను అభివృద్ధి చేయాలని ఎంపీ పసునూరి దయాకర్‌ అధికారులకు సూచించారు. హన్మకొండలోని కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ(దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శంకుస్థాపన సందర్భాల్లో ప్రొటోకాల్‌ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు.


రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌ మాట్లాడుతూ జిల్లాలో డొమెస్టిక్‌ విద్యుత్‌ కనెక్షన్లు వందకు వంద శాతం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల్లో అర్హులకు విద్యుత్‌ సరఫరా ప్రభుత్వ నిబంధనల మేరకు అందజేయాలని సూచించారు. వేయిస్తంభాల దేవాలయం మరింత అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయాలన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో లోవోల్టేజీ విద్యుత్‌ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ జిల్లాలో వైద్య, ఆరోగ్య సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-16T09:47:12+05:30 IST