మరమ్మతులకు ప్రణాళికలు సిద్దం

ABN , First Publish Date - 2020-07-03T11:21:56+05:30 IST

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న పంట కాలువల మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేసినట్లు జూరాల ప్రాజెక్టు ఎస్‌ఈ

మరమ్మతులకు ప్రణాళికలు సిద్దం

ఎస్‌ఈ రఘునాథరావు


ఆత్మకూర్‌, జూలై 2: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న పంట కాలువల మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేసినట్లు జూరాల ప్రాజెక్టు ఎస్‌ఈ రఘునాథరావు తెలిపారు. ఆ పంట  కాలువలను గురువారం ఆయన  పరిశీలించి మాట్లాడారు. ఎడమ కాలువ ఆ యకట్టు కింద నందిమల్ల, మూలమల్ల, జూరాల, ఆరేపల్లి, మొట్లంపల్లి, కత్తెపల్లి, వీరరాఘవపూర్‌, రేచింతల, తూంపల్లికి సంబంధించి పంట కాలువలు ఉన్నాయని, వాటిని పరిశీలించామని తెలిపారు. ఈఈ పార్థసారథి, డీఈ రవికుమార్‌, ఏఈ శంకర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-07-03T11:21:56+05:30 IST