నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

ABN , First Publish Date - 2020-07-06T10:44:06+05:30 IST

వేగంగా గ్రేటర్‌ నగరంగా రూపుదిద్దుకుంటున్న కరీంనగర్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలను రూపొందించా మని, దశలవారీగా అభివృద్ధి చేస్తామని మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు

నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

నగర మేయర్‌ వై.సునీల్‌ రావు 


కరీంనగర్‌ టౌన్‌, జూలై 5: వేగంగా గ్రేటర్‌ నగరంగా రూపుదిద్దుకుంటున్న కరీంనగర్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలను రూపొందించా మని, దశలవారీగా అభివృద్ధి చేస్తామని మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు. ఆదివారం నగరంలోని 14,36డివిజన్లలో కార్పొరేటర్లు దిండిగాల మహేశ్‌, గుగ్గిళ్ళ జయశ్రీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా 36వ డివిజన్‌లో స్థానికుల కోరిక మేరకు పార్కును అభివృద్ధి చేస్తామని, శిథిలమైన రోడ్లు, డ్రెయినేజీలను కొత్తగా వేసేందుకు అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్‌ చాడగొండ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.


అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు.. 

నగరంలోని 60డివిజన్లలో అభివృద్ధి పనులను చేపడతామని నగర మేయర్‌ వై.సునీల్‌రావు తెలిపారు. ఆదివారం 35వ డివిజన్‌ సప్తగిరికాలనీలో కార్పొరేటర్‌ చాడగొండ బుచ్చిరెడ్డితో కలిసి 10లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీరోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నాణ్యాతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని, 15రోజుల్లో ఈ పనులు పూర్తయ్యేలా చూడాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.


కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు సేవలు అభినందనీయం..

కరీంనగర్‌ కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణరావు సేవలు అభినందనీయమని నగర మేయర్‌ వై.సునీల్‌రావు కొనియాడారు. ఆదివారం సత్యనారాయణరావు పదవీ విరమణ సందర్భంగా బ్యాంకులో ఏర్పాటుచేసిన వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి మేయర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ఒక సంస్థ అభివృద్ధి చెందేందుకు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల నిబద్ధత ఎంతో ముఖ్యమని, అలాంటి నిబద్ధతగల అధికారుల్లో సత్యనారాయణరావు ఒకరని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే, బ్యాంకు మాజీ వైస్‌ చైర్మన్‌ వుచ్చిడి మోహన్‌రెడ్డి, శ్రీధర్‌, బ్యాంకు అధికారులు, వివిధ బ్రాంచీల మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.


సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి..

వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌గా వచ్చే వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్‌ వై.సునీల్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం 10గంటల 10నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఆయన 35వ డివిజన్‌లో కార్పొరేటర్‌ చాడగొండ బుచ్చిరెడ్డితో కలిసి పాలొ ్గన్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు ఇళ్ళకు వెళ్ళి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 59వ డివిజన్‌లో కార్పొరేటర్‌ గందె మాధవి ఆమె ఇంటి పరిసరాలతోపాటు డివిజన్‌లోని పలుఇళ్లకు వెళ్ళి పరిసరాలనుశుభ్రం చేశారు. 17వ డివిజన్‌ పరిధి శ్రీరాంనగర్‌ కాలనీలో ఒకరికి కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో మున్సిపల్‌ అధికారులు శానిటరీ సూపర్‌వైజర్‌ వేణుమాధవ్‌, ఇన్‌స్పెక్టర్‌ గట్టు శ్రీనివాస్‌ హుటాహుటిన శ్రీరాంనగర్‌కాలనీకి చేరుకొని కోవిడ్‌ బారినపడిన వారి ఇంటి పరిసరాలతోపాటు కాలనీలో స్ర్పే చేయించారు.

Updated Date - 2020-07-06T10:44:06+05:30 IST