గ్రహాల గుర్తింపునకు ‘షెఫీల్డ్‌’ అధ్యయనం

ABN , First Publish Date - 2020-06-07T08:21:30+05:30 IST

భూమి లాంటి మరికొన్ని గ్రహాలను వాటి ప్రారంభ దశలోనే కనుగొనే అవకాశం గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువగా ఉందని

గ్రహాల గుర్తింపునకు ‘షెఫీల్డ్‌’ అధ్యయనం

లండన్‌ జూన్‌ 6: భూమి లాంటి మరికొన్ని గ్రహాలను వాటి ప్రారంభ దశలోనే కనుగొనే అవకాశం గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువగా ఉందని యూకేలోని షెఫీల్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. ఇందుకోసం వీరు గియా టెలిస్కో్‌పను ఉపయోగించి పాలపుంతలోని కొన్ని నక్షత్ర సమూహాలను పరిశీలించారు. వీటి ల్లో ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో సూర్యుడిని పోలిన నక్షత్రాలు ఉండటాన్ని గమనించారు. ఇవి భూమి వంటి మరికొన్ని గ్రహాలను వాటి ప్రారంభ దశలోనే గుర్తించడానికి తోడ్పడతాయి. ప్రారంభ దశలో ఉండే భూమి వంటి గ్రహాలను మాగ్మా మహాసముద్ర గ్రహాలు (ఓషియన్‌ ప్లానెట్స్‌) అంటారు.


చిన్న గ్రహాలతో గుద్దుకోవడం, శిలాద్ర వం వల్ల మాగ్మా మహాసముద్ర గ్రహాలు ఏర్పడతాయి. ఇవి చాలా వేడిని విడుదల చేస్తాయి. వీటి ఉపరితలం కరిగిన రాతి మాదిరిగా ఉంటుంది. నక్షత్రాల కంటే రెండు రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇన్ర్ఫా-రెడ్‌ టెలిస్కోప్‌ ద్వారా మాత్రమే వీటి నుంచి వెలువడే కాంతిని పరిశీలించవచ్చు. ఇవి ఉండే సమూహాలను ‘యంగ్‌ మూవింగ్‌ గ్రూప్స్‌’ గా పిలుస్తారు.  భూమి వంటి నివాసయోగ్యమైన గ్రహాల పుట్టుకను తెలుసుకోవడానికి కూడా ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది. ఈ విషయాలు ఆస్ర్టోఫిజికల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Updated Date - 2020-06-07T08:21:30+05:30 IST