ఫిలిప్పీన్స్‌లో కుప్పకూలిన విమానం

ABN , First Publish Date - 2020-03-30T08:35:55+05:30 IST

కరోనా వైరస్‌కు సంబంధించిన మెడికల్ సామాగ్రిని ఫిలిప్పీన్స్ నుంచి జపాన్‌కు తీసుకెళ్తున్న విమానం టేక్‌ఆఫ్ అవుతూ కుప్పకూలింది. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా

ఫిలిప్పీన్స్‌లో కుప్పకూలిన విమానం

మనీలా: కరోనా వైరస్‌కు సంబంధించిన మెడికల్ సామాగ్రిని ఫిలిప్పీన్స్ నుంచి జపాన్‌కు తీసుకెళ్తున్న విమానం టేక్‌ఆఫ్ అవుతూ కుప్పకూలింది. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా ఎయిర్‌పోర్ట్‌లో టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఈ విచార సంఘటన చోటుచేసుకుంది. విమానం కుప్పకూలిన వెంటనే మంటలు చెలరేగడంతో విమానంలో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగినప్పటికి.. ఏ ఒక్కరి ప్రాణాలను కాపాడలేకపోయారని సమాచారం.


విమానం రన్‌వేపై కుప్పకూలడంతో రన్‌వే పూర్తిగా దెబ్బతిన్నట్టు అర్థమవుతోంది. వేరే విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా.. ఈ విమానం ప్రభుత్వ రంగ సంస్థకు చెందినది కాదని.. లయన్ ఎయిర్ అనే చార్టెడ్ కంపెనీకి చెందినదని అధికారులు వెల్లడించారు. జపాన్‌లోని హనెడాకు ఈ విమానం వెళ్లాల్సి ఉంది. గత కొద్ది రోజుల నుంచి జపాన్ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ నుంచి మెడికల్ సామాగ్రి జపాన్‌కు వెళ్లాల్సి ఉంగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ఇరు దేశాల ప్రభుత్వాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.

Updated Date - 2020-03-30T08:35:55+05:30 IST