ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ఉచితంగా స్థలం

ABN , First Publish Date - 2022-06-25T04:44:17+05:30 IST

మండలంలోని చవటపాళెం పంచాయతీ సరస్వతీ నగర్‌ వద్ద ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి కేటాయించిన ఐదెకరాల స్థలం ఉచితంగా ఇస్తున్నట్టు రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది.

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ఉచితంగా స్థలం
కేటాయించిన స్థలం ఇదే

 మంత్రి కాకాణి విజ్ఞప్తితో కేబినేట్‌ నిర్ణయం

 వెంకటాచలం, జూన్‌ 24: మండలంలోని చవటపాళెం పంచాయతీ సరస్వతీ నగర్‌ వద్ద ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి కేటాయించిన ఐదెకరాల స్థలం ఉచితంగా ఇస్తున్నట్టు రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది. మారె ్కట్‌ విలువ ప్రకారం ఎకరానికి రూ. 25లక్షలు చెల్లిస్తే కేటాయించేలా గత  కేబినెట్‌లో తీర్మానించారు. అమరావతిలో శుక్రవారం జరిగిన  రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మార్కెట్‌ విలువ ప్రకారం కాకుండా ఆ స్థలం ఉచితంగా కేటాయించాలని గత తీర్మానాన్ని సవరిస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర మంత్రులు కాకాణి తీర్మానాన్ని సమ్మతించి ఉచితంగా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కేబినెట్‌లో తన తీర్మానానికి అంగీకారం తెలిపిన  సీఎంకు, ఇతర మంత్రులకు మంత్రి కాకాణి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-06-25T04:44:17+05:30 IST