Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 05 May 2022 11:38:41 IST

ఇప్పుడప్పుడే పార్టీ లేదు.. ముందైతే 3,000km నడుస్తా: PK

twitter-iconwatsapp-iconfb-icon
ఇప్పుడప్పుడే పార్టీ లేదు.. ముందైతే 3,000km నడుస్తా: PK

పాట్నా: ఎన్నికల వ్యూహకర్త Prashant Kishor భారీ పాదయత్ర చేయనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి PK రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. వీటికి ఆయన సమాధానం ఇప్పుడప్పుడే పార్టీ లేదని స్పష్టం చేశారు. గురువారం ఆయన స్వరాష్ట్రం Bihar లోని Patna లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పీకే మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. Mahatma Gandhi జయంతి పురస్కరించుకుని October 2న బిహార్ నుంచి Padyatra ప్రారంభించనున్నట్లు పీకే పేర్కొన్నారు.

‘‘అక్టోబర్ 2న బిహార్‌లోని West Champaran Gandhi Ashram నుంచి 3,000 కిలీ మీటర్ల పాదయాత్ర ప్రారంభించబోతున్నాను. ప్రతి ఇంటికి ప్రతి కార్యాలయానికి వెళ్తాం. వాళ్ల తలుపు తట్టి సమస్యలు ఏంటో కనుక్కుంటాం. బిహార్‌లోని సమస్యల గురించి అవగాహన ఉన్న వారిలో సుమారుగా 17,000-18,000 మందిని కలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలి అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ప్రక్రియను  August-September కల్లా పూర్తి చేయాలి’’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

‘‘నయీ సోచ్.. నయా ప్రయాస్’’ (కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం) అనే ఆలోచనా విధానంతో తాము ముందుకు వెళ్లనున్నట్లు పీకే తెలిపారు. వాస్తవానికి బిహార్‌లో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవని, అందుకే రాజకీయ పార్టీ గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదని అన్నారు. కానీ రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన విధానాల రూపకల్పనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పాదయాత్రను ఎంచుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘‘నేను సున్నా నుంచి ప్రారంభం అవుతున్నాను. రాబోయే మూడు-నాలుగు ఏళ్లను పూర్తిగా ప్రజా సుపరిపాలనను తీసుకురావడానికి కేటాయిస్తాను. ఇక రాజకీయంగా ఏ పార్టీతో కలిసి వెళ్లేది లేదని పీకే ప్రకటించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూనే బిహార్‌లో అతిపెద్ద పార్టీలైన ఆర్జేడీ, జేడీయూలపై విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీల అధినేతలైన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌లను ప్రస్తావిస్తూ విమర్శించారు. అయితే రాజకీయ పార్టీ ఏర్పాటుపై పీకే మరొక మాట అన్నారు. అందరూ ఊహించినట్లుగా తాను ఏ రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదని, బిహార్‌లో మార్పు కోరుకునే వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనేదే తన ఉద్దేశమని అన్నారు.

ఇక తన ప్రస్తుతం కొనసాగబోయే ప్రస్థానంలో ఆర్థిక అవసరాల గురించి పీకే మాట్లాడుతూ ‘‘మన దగ్గర ఓట్లు ఉంటే డబ్బులు సమకూర్చుకోవచ్చు’’ అని సమాధానం ఇచ్చారు. తనకు ఏ పార్టీపై వ్యక్తిగత విబేధాలు లేవని.. నితీశ్, లాలూలతో పాటు బిహార్‌లోని ఏ పార్టీ నేతలపై వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. నితీశ్‌ను తనకు తండ్రిగా చెప్పుకొచ్చిన పీకే.. అలా అని సొంతంగా రాజకీయ వేదిక నిర్మించుకోవడంలో తప్పేం లేదంటూ వ్యాఖ్యానించారు. బిహార్ మార్పుపై తాను చేసిన వాగ్దాలనాపై అనేక అనుమానాలు ఉండొచ్చని, అయితే తనకు సమయం కావాలని, తనుక ఒక అవకాశం ఇవ్వాలని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.