కాంగ్రెస్‌లో రాహుల్ స్థానంపై ప్రశాంత్ కిశోర్ ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2022-04-29T21:48:35+05:30 IST

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయమై పీకే ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి ఏ స్థానం ఇవ్వాలని పీకేను ప్రశ్నించగా రాహుల్ స్థానాన్ని తానే కాదు, ఎవరూ నిర్ణయించలేరని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకత్వం కోసం తాను రాహుల్..

కాంగ్రెస్‌లో రాహుల్ స్థానంపై ప్రశాంత్ కిశోర్ ఏమన్నారంటే..?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చేరనని ఆ పార్టీ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సమస్య ఉందంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా, కాంగ్రెస్ పార్టీకి మళ్లీ రాహుల్ గాంధీయే అధినేతగా కాబోతున్నారనే ప్రచారం జోరుగానే ఉన్నప్పటికీ పీకే వ్యాఖ్యలు అందుకు ప్రతికూలంగానే కనిపిస్తున్నట్లు ఉన్నాయి. ప్రియాంక గాంధీ పార్టీని నడిపించాలని, గాంధీయేతరులు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండాలంటూ పీకే చేసిన చర్చలు విఫలమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్‌ను పార్టీ నాయకత్వంకి తీసుకోవడం ప్రయోజనం లేదని పీకే భావన అన్నట్లు తెలుస్తోంది.


కాగా, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయమై పీకే ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి ఏ స్థానం ఇవ్వాలని పీకేను ప్రశ్నించగా రాహుల్ స్థానాన్ని తానే కాదు, ఎవరూ నిర్ణయించలేరని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకత్వం కోసం తాను రాహుల్ గాంధీ పేరును కానీ ప్రియాంక పేరును కానీ మరే ఇతర వ్యక్తి పేరును కానీ సిఫారసు చేయలేదని, కానీ కాంగ్రెస్‌ను మెరుగ్గా నడిపించే వ్యక్తి కావాలని మాత్రమే చెప్పినట్లు తెలిపారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రాహుల్, ప్రియాంకల గురించి చర్చ జరగలేదని పి.చిదంబరం కూడా చెప్పిన విషయాన్ని పీకే గుర్తు చేశారు.

Updated Date - 2022-04-29T21:48:35+05:30 IST