హైదరాబాద్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Union Minister Piyush Goyal)కు మంత్రి కేటీఆర్ (KTR) లేఖ రాశారు. టెక్స్‌టైల్, చేనేత రంగాలపై కేంద్రం నిరాసక్తత చూపుతోందని తప్పుబట్టారు. జౌళి రంగానికి, చేనేత కార్మికులకు బీజేపీ సర్కార్ పైసా సాయం చేయలేదని విమర్శించారు. చేనేతపై జీఎస్టీ అనాలోచిత నిర్ణయమని తప్పుబట్టారు. మోదీ సర్కార్ నేతన్నల కడుపుకొడుతోందని మండిపడ్డారు. చేనేత, జౌళి రంగాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రకటనలు కాదు.. పథకాలు రావాలి.. మాటలు కాదు-నిధుల మూటలు ఇవ్వండని కేటీఆర్ కోరారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్ర సాయం ఎక్కడ? అని ప్రశ్నించారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని, టెక్స్‌టైల్‌పై జీఎస్టీ (GST) తగ్గించాలన్నారు. చేనేత, జౌళి రంగాల సమస్యలపై పార్లమెంట్‌లో నిలదీస్తామని కేటీఆర్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి