Delhi: ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందే: పియూష్ గోయల్

ABN , First Publish Date - 2022-07-22T20:14:43+05:30 IST

ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనని కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.

Delhi: ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందే: పియూష్ గోయల్

ఢిల్లీ (Delhi): ఉచిత బియ్యాన్ని (Free rice) తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనని కేంద్రమంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) స్పష్టం చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ...  ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt.) సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు. ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనన్నారు. రాష్ట్రాలు ఉచిత బియ్యం పంపిణీని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఉచిత బియ్యాన్ని తెలంగాణ సరిగ్గా పంపిణీ చేయడం లేదని.. అందుకే తెలంగాణపై ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చిందని అన్నారు. ఏపీ(AP)తో కూడా ఉచిత బియ్యం పంపిణీపై మాట్లాడుతున్నామని, త్వరలో అక్కడ కూడా ఉచిత బియ్యం పంపిణీ సవ్యంగా చేస్తారని అనుకుంటున్నానని పియూష్ గోయల్ అన్నారు.

Updated Date - 2022-07-22T20:14:43+05:30 IST