పదేళ్ల చిన్నారి సంపాదన నెలకు రూ.కోటి.. అదెలాగంటే..

ABN , First Publish Date - 2021-12-10T09:38:35+05:30 IST

తల్లిదండ్రులందరూ త‌మ పిల్ల‌లు పెద్ద‌వారై జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని ఆశిస్తారు. కానీ రాక్సీ జాసెంకో(42) అనే మ‌హిళ త‌న కూతురు బాల్యంలోనే పెద్ద వ్యాపార‌వేత్త కావాల‌ని కృషి చేసింది...

పదేళ్ల చిన్నారి సంపాదన నెలకు రూ.కోటి.. అదెలాగంటే..

తల్లిదండ్రులందరూ త‌మ పిల్ల‌లు పెద్ద‌వారై జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని ఆశిస్తారు. కానీ రాక్సీ జాసెంకో(42) అనే మ‌హిళ త‌న కూతురు బాల్యంలోనే పెద్ద వ్యాపార‌వేత్త కావాల‌ని కృషి చేసింది. ఆమె చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించి ప్ర‌స్తుతం ఆమె 10 ఏళ్ల‌ కూతురు పిక్సీ చిన్న‌పిల్ల‌ల మేక‌ప్, బొమ్మ‌లు విక్ర‌యించే వ్యాపారం చేస్తోంది. ఆ వ్యాపారం ద్వారా నెల‌కు రూ.కోటి పైగా సంపాదిస్తోంది.


వివ‌రాల్లోకి వెళితే.. అస్ట్రేలియాకు చెందిన పిక్సీ కర్టిస్ అనే 10 ఏళ్ల చిన్నారి విజ‌య‌వంతంగా తన బిజినెస్ చేస్తోంది. దీనికి కారణం అమె త‌ల్లి రాక్సీ జాసెంకో. పిక్సీ పుట్టగానే ఆమె పేరు మీద రాక్సీ 2011లో పిక్సీస్ బౌస్ అనే వ్యాపారం ప్రారంభించింది. ఆ తర్వాత పిక్సీస్ ఫిడ్‌జెట్స్ అనే మరో వ్యాపారం కూడా ప్రారంభించింది. పిక్సీ తన బ్రాండుతో విక్రయించే పిల్లల బొమ్మలు, పిల్లలకు అవసరమయ్యే స్టేషనరీ, సరదా గాడ్జెట్స్ వంటివాటికి ప్రస్తుతం అక్కడ మంచి డిమాండ్ ఉంది.


ఇవికాక కొత్తగా వచ్చే బొమ్మలకు ఈ పదేళ్ల చిన్నారి రివ్యూ కూడా ఇస్తుంది. అవి ఎలా ఉపయోగించాలో, వాటి ధర ఎంతో, ఏ వయసు వారికి బాగుంటాయో చెబుతుంది. ఇలా చిన్నప్పటి నుంచే వ్యాపారంలో కిటుకులు తెలుసుకున్న పిక్సీ తన రెండు వ్యాపారాల ద్వారా ఇప్పుడు నెలకు కోటి రూపాయల దాకా సంపాదిస్తోంది. అంతేకాదు పిక్సీ ఇన్‌స్టా‌గ్రామ్‌ అకౌంట‌్‌కు 90వేల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. నాలుగేళ్ల కిందట.. అంటే పిక్సీకి ఆరేళ్ల వయసప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సరింగ్ యాడ్ కోసం నాలుగున్నర లక్షలు తీసుకుంది.




త‌న కూతురి స‌క్సెస్ గురించి రాక్సీ మాట్లాడుతూ.. “నేను 14 ఏళ్ల వ‌య‌సులో మెక్ డొనాల్డ్స్‌లో వెయిట‌ర్ ప‌నిచేసేదాన్ని.. కానీ నా కూతురు 10 ఏళ్ల‌కే త‌న పేరు మీద బిజినెస్ ర‌న్ చేస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే.. పిక్సీ త‌లుచుకుంటే 15 ఏళ్ల‌కే రిటైర్ అయి త‌న జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించ‌వ‌చ్చు” అని చెప్పింది.

Updated Date - 2021-12-10T09:38:35+05:30 IST