Abn logo
Apr 17 2021 @ 00:43AM

గూగుల్‌ ‘పిక్సల్‌ వాచ్‌’ ఈ ఏడాదే

గూగుల్‌ తన మొదటి స్మార్ట్‌ వాచ్‌ ‘పిక్సల్‌ వాచ్‌’ను ఈ ఏడాదే మార్కెట్‌లోకి తీసుకురానుంది. ‘రోహన్‌’ దీని కోడ్‌ నేమ్‌. యూట్యూబ్‌లో  టిప్‌స్టార్‌ జాన్‌ ప్రోస్సెర్‌ విడుదల చేసిన వీడియోలో ఈ సమాచారం అందించారు. ఇరవై వరకు వివిధ రంగుల బ్యాండ్‌ ఆప్షన్స్‌తో రౌండ్‌ డయల్‌తో విడుదల కానుంది. పిక్సల్‌ 6తో ఈ అక్టోబర్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. అమెరికా, జపాన్‌ దేశాల్లో పిక్సల్‌ 5ఎ, 5జి స్మార్ట్‌ ఫోన్‌ను గూగుల్‌ రిలీజ్‌ చేస్తోంది.  చిప్‌ కొరత కారణంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ తయారీని రద్దు చేసుకున్నట్టు పుకార్లు షికారు చేశాయి. అయితే యథాప్రకారం ఆ స్మార్ట్‌ఫోన్‌ అమెరికా, జపాన్‌ దేశాల్లో విడుదల అవుతుందని గూగుల్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 

Advertisement
Advertisement
Advertisement