ప్రస్తుతం డిజిటల్ మాధ్యమానికి తెలుగులోనూ మంచి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు చూసేందుకు తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ తారలు కూడా వీటిల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీల ద్వారా విభిన్న ప్రయోగాలు చేసేందుకు ప్రముఖ దర్శకులు సిద్ధపడుతున్నారు.
ప్రముఖ దర్శకులు తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి రూపొందించిన వెబ్ సిరీస్ `పిట్ట కథలు`. ఈ సిరీస్‌లోని నాలుగు ఎపిసోడ్లను ఈ నలుగురూ దర్శకులూ రూపొందించారు. శ్రుతీ హాసన్, అమలా పాల్, ఈషా రెబ్బ, మంచు లక్ష్మి, జగపతిబాబు, సత్యదేవ్, అషిమా నర్వాల్ తదితరులు ఈ వెబ్ సిరీస్‌లో నటించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ బయటకు వచ్చింది. టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రాబోతోంది.