Advertisement
Advertisement
Abn logo
Advertisement

డ్వాక్రా సొమ్ములు లాగేస్తున్న ప్రభుత్వం

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం రూరల్‌, డిసెంబరు 5: ఓటీఎస్‌ కోసం మహిళలకు తెలియకుండా ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకుని డ్వాక్రా సంఘాలు నుంచి సొమ్ములు తీసుకుంటున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడు గ్రామంలో ఆదివారం గౌరవ సభ-ప్రజాసమస్యలపై చర్చా వేదికలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వర్మ మాట్లాడుతూ 1983 నుంచి ప్రభుత్వ సాయంతో గృహాలు నిర్మించుకున్న వారిని ఇప్పుడు బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి తేవడం తుగ్లక్‌ చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలా ఉందన్నారు. బి.ప్రత్తిపాడులో టీడీపీ హయాంలో రూ.3కోట్లు వ్యయంతో అభివృద్ధి పనులు నిర్వహించామని, మరో రూ.70లక్షల పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. సుద్దగడ్డ ఆధునీకరణ పనులను టీడీపీ హయాంలో ప్రారంభించామని, ప్రస్తుత ఎమ్మెల్యే వాటిని చేయించలేకపోయారని వర్మ విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్‌, బొజ్జా సూరిబాబు, రా జబాబు, ఊటా కృష్ణబాబు, రమేష్‌, బొజ్జా విష్ణు, వసంత విష్ణు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement