గొల్లప్రోలు త్రయాహంలో భజన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ
గొల్లప్రోలు, జనవరి 16: పట్టణంలోని కొత్తపేట రామాలయంలో త్రయాహన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 72గంటల పాటు నిరంతరాయంగా జరిగే ఈ భజన కార్యక్రమాల్లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీ పీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మ పాల్గొని భజనలు చేశారు. పురాతన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వర్మ అన్నారు. నిర్వాహకులను అభినందించారు. ఆయన వెంట నగర పంచాయతీ మాజీ చైర్మన్ శీరం మాణిక్యం, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు తదితరులున్నారు.