Abn logo
Jul 28 2021 @ 00:05AM

రహదారులను పట్టించుకోని ప్రభుత్వం

గొల్లప్రోలు మండలం చెందుర్తిలో అధ్వానంగా ఉన్న రోడ్లను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

 పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

గొల్లప్రోలు రూరల్‌, జూలై 27: గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అధ్వానస్థితికి చేరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. మండలంలోని చెందుర్తిలో పాడైన రోడ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అడుగడుగునా గోతులు పడినా కనీసం అందులో మట్టి కూడా వేయట్లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వర్మ వెంట మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌, టీడీపీ నాయకులు మల్లిపూడి వీరబాబు, శివ, తాటిపర్తి త్రిమూర్తులు, భద్రరావు తదితరులున్నారు.