చకచకా తాగునీటి పథకం పనులు

ABN , First Publish Date - 2021-04-17T04:25:11+05:30 IST

ఏడు సెజ్‌ల దాహార్తి తీర్చే మెగా మంచినీటి పథకం పనులు చకచకా జరుగుతున్నాయి.. కండలేరు డ్యాం నుంచి నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని 7 సెజ్‌ల దాహార్తి తీర్చేందుకు ఏపీఐఐసీ ద్వారా సుమారు రూ.500కోట్ల వ్యయంతో పనులు చేపట్టిన విషయం తెలిసిందే

చకచకా తాగునీటి పథకం పనులు
పైప్‌ల ఏర్పాటుకు గుంతలు తీస్తున్న ఎక్స్‌కవేటర్‌

35 కిలోమీటర్ల పైప్‌లైన్‌ పనులు పూర్తి

రాపూరు, ఏప్రిల్‌ 16: ఏడు సెజ్‌ల దాహార్తి తీర్చే మెగా మంచినీటి పథకం పనులు చకచకా జరుగుతున్నాయి.. కండలేరు డ్యాం నుంచి నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని 7 సెజ్‌ల దాహార్తి తీర్చేందుకు ఏపీఐఐసీ ద్వారా సుమారు రూ.500కోట్ల వ్యయంతో పనులు చేపట్టిన విషయం తెలిసిందే. కండలేరు డ్యాం పికప్‌ఏరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌  నుంచి ప్రారంభించి  రాపూరు-పొదలకూరు రోడ్డు, రాపూరు- సైదాపురం రోడ్డులో సుమారు 35 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి సుమారు 100 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్‌ సమీపంలోని గిలకపాడు సమీపంలో భారీ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 



Updated Date - 2021-04-17T04:25:11+05:30 IST