పింగళి జాతీయ జెండాలో.. ప్రతి భారతీయుడి ఆత్మాభిమానం!

ABN , First Publish Date - 2022-08-01T09:11:06+05:30 IST

: పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాలో భక్తి, స్ఫూర్తితోపాటు ప్రతి భారతీయుడి ఆత్మాభిమానం కనిపిస్తుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

పింగళి జాతీయ జెండాలో.. ప్రతి భారతీయుడి ఆత్మాభిమానం!

రేపు ఢిల్లీలో 146వ జయంతి వేడుకలు

పింగళి కుటుంబ సభ్యులకు మోదీ సత్కారం

స్టాంప్‌ విడుదల చేయనున్న అమిత్‌షా: కిషన్‌రెడ్డి 


కూచిపూడి/తాడేపల్లి/అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాలో భక్తి, స్ఫూర్తితోపాటు ప్రతి భారతీయుడి ఆత్మాభిమానం కనిపిస్తుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై ఆగస్టు 13 నుంచి 15 వరకూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆదివారం కిషన్‌రెడ్డి కృష్ణా జిల్లా భట్లపెనుమర్రుకు వచ్చారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటిలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పింగళి వెంకయ్య గొప్పతనాన్ని ఆయా సందర్భాల్లో కొనియాడారు. పింగళి 146వ జయంతి వేడుకలను ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలో పెద్దఎత్తున నిర్వహిస్తామన్నారు.


యన కుటుంబసభ్యులను ఆహ్వానించామని, ప్రధాని మోదీ వారిని సత్కరిస్తారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేస్తారని వెల్లడించారు. 3న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పార్లమెంటు విజయ్‌చౌక్‌ వరకూ ఎంపీలందరూ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారని చెప్పారు. పింగళి స్వగ్రామమైన భట్లపెనుమర్రులో స్మృతివనం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన మనుమరాలు సుశీలను సత్కరించారు. పింగళికి భారతరత్న ప్రకటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లాకే చెందిన ప్రసిద్ధ నేపథ్య గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఘంటసాల శతాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. భట్లపెనుమర్రులో మౌలిక వసతుల కల్పనకు, తారు రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఆర్డీవో విజయ్‌కుమార్‌ను కిషన్‌రెడ్డి ఆదేశించారు.


రోడ్డు పనులు రాష్ట్రప్రభుత్వం చేపట్టకపోతే ప్రధానితో మాట్లాడి తామే చేపడతామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. తొలుత కిషన్‌రెడ్డికి జేసీ మహేశ్‌కుమార్‌ స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్థులు రోడ్లపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జేసీ ఎక్కడా అని మంత్రి ుంమత్రిర  ప్రశ్నించగా, వెళ్లిపోయారని అధికారులు చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వచ్చినా ఆయన  ఉండరా.. అంత తీరిక లేదా అని ఆక్షేపించారు. 

Updated Date - 2022-08-01T09:11:06+05:30 IST