సరదా సరదాగా...!

ABN , First Publish Date - 2020-06-01T05:30:00+05:30 IST

స్పూన్‌లో నిమ్మకాయ పెట్టి, స్పూన్‌ను నోట్లో పెట్టుకుని పరుగెత్తే ఆట చూసే ఉంటారు. ఇది కూడా అలాంటిదే! అయితే ఇందులో పరుగెత్తడం ఉండదు. నిమ్మకాయకు బదులుగా పింగ్‌ పాంగ్‌ బాల్స్...

సరదా సరదాగా...!

స్పూన్‌లో నిమ్మకాయ పెట్టి, స్పూన్‌ను నోట్లో పెట్టుకుని పరుగెత్తే ఆట చూసే ఉంటారు. ఇది కూడా అలాంటిదే! అయితే ఇందులో పరుగెత్తడం ఉండదు. నిమ్మకాయకు బదులుగా పింగ్‌ పాంగ్‌ బాల్స్‌ ఉపయోగిస్తారు.




ఈ గేమ్‌ ఆడటానికి కావలసినవి

  1. రెండు ట్రేలు
  2. ఒక ప్లాస్టిక్‌ స్పూన్‌
  3. కొన్ని పింగ్‌ పాంగ్‌ బాల్స్‌ 


ఇలా ఆడాలి!

  1. రెండు ట్రేలను టేబుల్‌ మీద పక్కపక్కన పెట్టాలి.
  2. ఒక ట్రేలో పింగ్‌ పాంగ్‌ బాల్స్‌ వేయాలి.
  3. గేమ్‌ ఆడే వ్యక్తి నోట్లో స్పూన్‌ పెట్టుకుని ఒక ట్రేలో ఉన్న బాల్స్‌ను మరో ట్రేలో వేయాలి. బాల్స్‌ను స్పూన్‌తో మాత్రమే తీయాలి. చేత్తో ముట్టుకోకూడదు.
  4. ఒక నిమిషం సమయంలో ఎవరు ఎక్కువ బాల్స్‌ ట్రేలో వేస్తే వాళ్లు గెలిచినట్టు! 

Updated Date - 2020-06-01T05:30:00+05:30 IST