Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఫైన్‌’యాపిల్‌

పైనాపిల్‌ చూడటానికి యాపిల్‌  అంత అందంగా ఉండదు.. కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కన్నులున్నట్లుంటే ఈ తీపి, వగరు పండు మనదేశానిది కాదు. బ్రెజిల్‌, పెరుగ్వేలో పండేవి. 1548లో పోర్చుగీసు ప్రాంతంలోని వర్తకులు ఆయా దేశాలకు విత్తనాలను తీసుకెళ్లారు. 19వ శతాబ్దం తొలిరోజుల్లో ఆస్ర్టేలియానుంచి మన దేశానికి ఆ మొక్కలు దిగుమతి అయ్యాయి. మనదేశంలోనూ బాగా కాస్తోన్న ఈ పైనాపిల్‌ తింటే ఆరోగ్యం ‘ఫైన్‌’ అనాల్సిందే! 


పైనాపిల్‌లో సి-విటమిన్‌ పుష్కలం. దీంతో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి మన ఒంట్లో వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. గాయాలు, ఇన్‌ఫెక్షన్లను త్వరగా మాన్పే లక్షణముంటుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బ్లడ్‌క్లాటింగ్‌ ఉండదు. ఇందులో విటమిన్‌-ఎ ఉండటం వల్ల కంటికి మంచిది. 


పైనాపిల్‌ తింటే జీర్ణసమస్యలు తొలిగిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లు డైట్‌లో వాడుతుంటారు. మీకో విషయం తెలుసా.. ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలను తీసుకుంటే అందులో ఒక మిల్లీ గ్రాము సోడియం, అధిక శాతం పొటాషియం ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. దీంతో పాటు దంతాలు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దగ్గు, జలుబు రాకుండా పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదలకూ మంచిదే. కాపర్‌, మాంగనీస్‌.. ఇలా అనేకమైన పోషకాలుంటాయి. పైనాపిల్‌ తినటానికి ఇష్టపడని పిల్లలకు, పెద్దవారికి పైనాపిల్‌ జ్యూస్‌ ఇచ్చినా మంచిదే.Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...