సీపీఎం నేతను పెళ్లాడనున్న సీఎం కుమార్తె

ABN , First Publish Date - 2020-06-10T01:57:18+05:30 IST

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ...

సీపీఎం నేతను పెళ్లాడనున్న సీఎం కుమార్తె

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్‌ను వివాహం చేసుకోనున్నారు. ఇంతకు ముందే వీరి వైవాహిక జీవితాలు విడాకులతో ముగియడంతో ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కానుంది. వృత్తి రీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న రియాజ్.. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కొజికోడ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన వీణ బెంగళూరులో సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. వీణకు ఒక్కరు, రియాజ్‌కు ఇద్దరు చొప్పున ఇంతకు ముందే పిల్లలు ఉన్నారు. ఈ నెల 15న వివాహం చేసుకునేందుకు వీరిద్దరూ రిజిస్టర్ చేసుకోగా.. ప్రస్తుతం కొవిడ్-19 నిబంధనల దృష్ట్యా ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరగనుంది.

Updated Date - 2020-06-10T01:57:18+05:30 IST