గాయాలు, రక్తపాతం లేని కొత్త రకం బాక్సింగ్.. రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న పిల్లో ఫైటింగ్ చాంపియన్‌షిప్.. దీని ప్రత్యకతలు ఏమిటంటే..

ABN , First Publish Date - 2022-02-04T09:49:49+05:30 IST

బాక్సింగ్, ఫైటింగ్, కుస్తీ పోటీలంటే రక్తపాతం, హింస, పంచ్‌లు, కేకలు, ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇవేవి లేకుండా.. అమెరికాలో ఓ కొత్త రకం బాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది. అదే పిల్లో ఫైటింగ్(తలగడల ఫైటింగ్). ఇందులో ప్లేయర్లు...

గాయాలు, రక్తపాతం లేని కొత్త రకం బాక్సింగ్.. రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న పిల్లో ఫైటింగ్ చాంపియన్‌షిప్.. దీని ప్రత్యకతలు ఏమిటంటే..

బాక్సింగ్, ఫైటింగ్, కుస్తీ పోటీలంటే రక్తపాతం, హింస, పంచ్‌లు, కేకలు, ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇవేవి లేకుండా.. అమెరికాలో ఓ కొత్త రకం బాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది. అదే పిల్లో ఫైటింగ్(తలగడల ఫైటింగ్). ఇందులో ప్లేయర్లు తలగడలను పట్టుకొని ఒకరినొకరు కొట్టుకుంటారు. ఈ పోటీలకు అక్కడ విపరీతమైన ఆదరణ లభిస్తోంది.


దిండులతో చిన్నప్పుడు కొట్లాడటం సహజమే. కొంత వయసు వచ్చాక తలగడలతో పోరాడటం ఉండదు. కానీ, ఇప్పుడు కేవలం పిల్లలకు మాత్రమే అనే లిమిట్ చెరిపేసి పిల్లో ఫైటింగ్‌ను ఓ కంబాట్ స్పోర్ట్‌గా చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో దిండులు చేతబట్టుకుని ఫైటింగ్ చేసే పోటీ టోర్నమెంట్‌ను నిర్వహించారు. అంతేకాదు, ఆ పోటీలో విజయం సాధించిన ఫైటర్‌ను అధికారికంగా గుర్తించి బహుమానం అందించారు. ఈ టైటిల్ బెల్ట్ ప్రైజ్ మనీ సుమారు 3.75 లక్షలు.


ఈ పోటీ మిగతా ఫైటింగ్ పోటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దారు. మిగతా పోటీల్లాగే ఈ పోటీ కూడా రింగ్‌లో గంభీరంగా జరుగుతుంది. పంచ్‌లు వేసుకుంటారు. కానీ, చేతులతో కాదు.. కేవలం దిండులతోనే. అదే తరహాలో ఎదుటి వ్యక్తి దిండు పంచ్‌ను తప్పించుంటాడు. తన దిండుతో దాడి చేస్తాడు. రెఫరీలు.. ఇద్దరి మధ్య తలగడల పోరు ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే, ఇందులో ఎవరూ గాయపడరు. ఎక్కడా రక్తపు చుక్క బయటకు రాదు. కానీ, మిగతా కంబాట్ స్పోర్ట్స్‌లో ఉండే అన్నీ ఫీచర్లు ఇందులో ఉంటాయి.


ఇటీవల అమెరికాలో ఈ పిల్లో ఫైటింగ్ చాంపియన్‌షిప్‌ నిర్వహించారు. ఇందులో మహిళ, పురుషుల విభాగాలు ఉన్నాయి. మహిళల విభాగంలో బ్రెజిల్‌కు చెందిన ఇస్టెలా న్యూన్స్.. అమెరికాకు చెందిన కెండాల్ వోల్కర్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్నారు. కాగా, పురుషుల విభాగంలో అమెరికాకు చెందిన హాలీ తిల్మన్ టైటిల్ సాధించారు. 

Updated Date - 2022-02-04T09:49:49+05:30 IST