ఢిల్లీ: వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయారు. బీపీ, షుగర్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. అప్రమత్తమైన సహచర ఎంపీలు వెంటనే స్ట్రెచర్ తెప్పించి ఆయన్ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యవర్గాల ద్వారా తెలిసింది.