ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్

ABN , First Publish Date - 2021-12-06T23:47:37+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో

ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలయింది. పిల్‌ను లా విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్ దాఖలు చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఏ చట్ట ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలో చెప్పాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. కేంద్రం ప్రకటించిన కనీసం మద్దతు ధర రైతులకు అందేలా చూడాలని పిటిషనర్ కోరారు. ధాన్యాన్ని దళారుల దోచుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ పేర్కొన్నారు. 


జనవరి చివరి వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ఏజీ తెలిపారు. ఏజీ వాదనను పరిగణనలోకి తీసుకుని ధాన్యం కొనుగోళ్లకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిది. జనవరి మూడో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 




Updated Date - 2021-12-06T23:47:37+05:30 IST