బోధనాస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స కోసం పిల్‌!

ABN , First Publish Date - 2020-07-11T08:45:21+05:30 IST

వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల్లో కొవిడ్‌-19కు చికిత్స అందించాలని ..

బోధనాస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స కోసం పిల్‌!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల్లో కొవిడ్‌-19కు చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రులకు నోటీసులు జారీచేసింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.


డాక్టర్‌ శ్రీవాత్సన్‌ ఈ పిల్‌ వేశారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో బోధనాసుపత్రులను కరోనా చికిత్సకు వినియోగించుకోకపోవడం బాధ్యతలను విస్మరించడమే అవుతుందని పిటిషనర్‌ పేర్కొన్నారు. వెంటనే ఆయా ఆసుపత్రుల్లో కరోనా పీడితులకు చికిత్స అందించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది వసుధ వాదించారు. 

Updated Date - 2020-07-11T08:45:21+05:30 IST