ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌ నియామకంపై హైకోర్టులో పిల్‌

ABN , First Publish Date - 2021-09-08T01:19:21+05:30 IST

ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్

ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌ నియామకంపై హైకోర్టులో పిల్‌

అమరావతి: ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి.కనకరాజ్ నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలయింది. ఈ పిల్‌ను న్యాయవాది పారా కిషోర్ దాఖలు చేసారు. జస్టిస్ కనకరాజ్ నియామకం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, గతంలో రాష్ట్ర ఈసీగా చేసిన నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంతో దురుద్దేశ పూర్వకంగా ఈ నియామకాన్ని చేపట్టారని పిటిషనర్ పేర్కొన్నారు. వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పిటిషనర్ తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించే అవకాశం ఉంది. 

Updated Date - 2021-09-08T01:19:21+05:30 IST