వారిపై ఎన్నికల్లో నిషేధం విధించండి

ABN , First Publish Date - 2020-09-28T08:27:08+05:30 IST

తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నవారిని ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా నిషేధం విధించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్‌) దాఖలైంది. ఈ మేరకు కేంద్రం, భారత ఎన్నికల సంఘానికి(ఈసీఐ) సూచనలు జారీ చేయాలని పిటిషనర్‌ అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంను కోరారు...

వారిపై ఎన్నికల్లో నిషేధం విధించండి

  • సుప్రీంలో ప్రజాప్రయోజన వాజ్యం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నవారిని ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా నిషేధం విధించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్‌) దాఖలైంది. ఈ మేరకు కేంద్రం, భారత ఎన్నికల సంఘానికి(ఈసీఐ) సూచనలు జారీ చేయాలని పిటిషనర్‌ అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంను కోరారు. ‘‘ 2019లో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన 539మందిలో 233మంది తీవ్రమైన క్రిమినల్‌ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ పరిస్థితుల కారణంగా.. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం లభించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడంలో ఓటర్లకు ఆటంకం కలుగుతోంది’’ అని ఉపాధ్యాయ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-28T08:27:08+05:30 IST