దొనకొండలో పందులు, వీధి కుక్కల స్వైర విహారం

ABN , First Publish Date - 2022-01-25T05:46:05+05:30 IST

మండల కేంద్రమైన దొనకొండతో పాటు పలు గ్రామాల్లో పందులు, కోతులు, వీది కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.

దొనకొండలో పందులు, వీధి కుక్కల స్వైర విహారం
రహదారిపై ఇష్టారీతిన తిరుగుతున్న పందులు

ఆందోళనల్లో ప్రజలు - పట్టించుకోని అధికారులు

దొనకొండ, జనవరి 24 : మండల కేంద్రమైన దొనకొండతో పాటు పలు గ్రామాల్లో పందులు, కోతులు, వీది కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో అనేక వ్యాదులు ప్రభలుతున్నాయని ప్రజలు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు.

పందుల పెంపకందారులు సొంత స్ధలంలో పెంచాల్సింది పోయి వాటిని యథేచ్ఛగా గ్రామంలో వదిలేస్తున్నారు. అవి అన్నీ వీధుల్లో  సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వ్యాధులు ప్రబలినప్పుడు  హడావిడి చేయడం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తప్పా నివారణ చర్యలు చేపట్టటం లేదని ప్రజలు వాపోతున్నారు. రోడ్లపైన మురికినీరులో తిరుగుతూ జనావాసాల మద్యకు వచ్చి యథేచ్ఛగా స్వైరవిహరం చేస్తూ వ్యాదుల వ్యాప్తికి కారణం అవుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఆదమరిస్తే ఇళ్లల్లోకి సైతం జోరబడుతున్నాయని, పాఠశాలల వద్ద విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినే సమయంలో విచ్చలవిడిగా పరిసరాల్లో అతి సమీపంలో సంచరిస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు సాగుచేసిన పంటపొలాల్లో రాత్రివేళల్లో జోరబడి పంటలను నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి. పందుల సం చారంపై అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిననూ పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. వీటి వలన రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే వీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-01-25T05:46:05+05:30 IST