Viral Video: ఈ పావురం చాలా స్మార్టు గురూ.. మైకేల్‌ను మక్కీకి మక్కీ దించేసింది...

ABN , First Publish Date - 2022-01-03T01:00:42+05:30 IST

పక్షులు వింత వింత అరవడం, విచిత్రంగా ప్రవర్తించడం తరచూ చూస్తూ ఉంటాం. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. అయితే ఈ పావురం మాత్రం చాలా..

Viral Video: ఈ పావురం చాలా స్మార్టు గురూ.. మైకేల్‌ను మక్కీకి మక్కీ దించేసింది...

పక్షులు వింత వింత అరవడం, విచిత్రంగా ప్రవర్తించడం తరచూ చూస్తూ ఉంటాం. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. అయితే ఈ పావురం మాత్రం చాలా స్మార్టు. అచ్చు మైకెల్ జాక్సన్‌లా డాన్సు చేస్తోంది. మైకెల్ జాక్సన్ ఐకానిక్ స్టెప్ అయిన.. మూన్‌వాక్ డాన్సును కాపీ కొట్టినట్లుగా ఉంది. పావురం డాన్సు వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.


చాలా జంతువులు డ్యాన్సు చేయడం చూసుంటాం.. కానీ పావురం డ్యాన్సు చేయడం మాత్రం చాలా అరుదు. అందుకే ప్రస్తుతం ఈ పావురం డ్యాన్సు చేసే వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ కాకి కూడా డ్యాన్సు చేసే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో పావురం.. ఎవరో శిక్షణ ఇచ్చినట్లుగా వెనక్కు వెళ్తూ ఒంటి కాలితో డ్యాన్సు చేస్తుంది. సేమ్ టూ సేమ్ మైకెల్‌లా డ్యాన్సు చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గుర్రంపై పెళ్లిమంటపానికి చేరుకున్న వరుడు.. రెండో అంతస్థులో వధువు.. కిటికీలోంచి చూసుకుని ఇద్దరి రియాక్షన్‌ను చూస్తే..





Updated Date - 2022-01-03T01:00:42+05:30 IST