చిరస్మరణీయుడు ‘పిడికిటి’

ABN , First Publish Date - 2021-10-18T06:03:43+05:30 IST

చిరస్మరణీయుడు ‘పిడికిటి’

చిరస్మరణీయుడు ‘పిడికిటి’

పిడికిటి వెంకటేశ్వరరావు సంస్మరణ సభలో వక్తలు

కంచికచర్ల రూరల్‌, అక్టోబరు 17 : అమూల్యమైన వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలతో డాక్టర్‌ పిడికిటి వెంకటేశ్వరరావు స్థానికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు అన్నారు. స్థానిక ఓసీ క్లబ్‌లో ఆదివారం పిడికిటి సంస్మరణ కార్యక్రమం జరిగింది. తొలుత పిడికిటి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిడికిటి మృతి కంచికచర్ల పరిసర ప్రాంత ప్రజలకు తీరని లోటన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా వైద్యవృత్తితో విశేష సేవలందించిన ఆయనకు స్థానిక ప్రజలతో విడదీయలేని అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఈతరం వైద్యులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. 

నిరుపమాన వైద్య సేవలు : మాజీ మంత్రులు దేవినేని, నెట్టెం

వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లోనే డాక్టర్‌ పిడికిటి వెంకటేశ్వరరావు కంచికచర్ల, వీరులపాడు మండల ప్రజలకు నిరుపమాన వైద్య సేవలందించారని మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, నెట్టెం రఘురాం, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కొనియాడారు. సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ పిడికిటి మృతి కంచికచర్ల పరిసర ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీపీ మల్లెల పుల్లయ్యబాబు మాట్లాడుతూ  డాక్టర్‌ పిడికిటి వెంకటేశ్వరరావు ఆదర్శవంతమైన విలువలతో అందరికీ మార్గదర్శకులుగా నిలిచారన్నారు. అనంతరం పిడికిటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వేల్పుల సునీత, శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ గద్దె ప్రసాద్‌, మాజీ వైస్‌ ఎంపీపీ అల్లాడి కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు కోగంటి బాబు, పలువురు వైద్యులు, నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-18T06:03:43+05:30 IST