పిడకలతో ప్రేమ సమరం

ABN , First Publish Date - 2021-04-13T05:02:50+05:30 IST

జిల్లాలో ఇదొక ప్రాచీన ఆచారం. భద్రకాళి, వీరభద్రస్వామి ప్రేమ, పెళ్లి సమరానికి కారణమవుతుంది.

పిడకలతో ప్రేమ సమరం

ఆదోని, ఏప్రిల్‌ 12: జిల్లాలో ఇదొక ప్రాచీన ఆచారం. భద్రకాళి, వీరభద్రస్వామి ప్రేమ, పెళ్లి సమరానికి కారణమవుతుంది. దీన్ని ఆస్పరి మండలం కైరుప్పల గ్రామస్థులు పిడకల సమరంగా జరుపుకుంటారు. ఉగాది మరుసటి రోజు బుధవారం సాయంత్రం ఈ వేడుక జరుగనుంది. భద్రకాళిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు పెద్దలు ఒప్పుకోవడం లేదని వీరభద్ర స్వామి మాట మార్చేస్తాడు. ఇది ఇద్దరి మధ్య సమరానికి కారణం అవుతుంది. దీన్ని ఒక వేడుకగా ఇప్పటికీ జరుపుకుంటున్నారు. వీరభద్రస్వామిపై ఆగ్రహంతో భద్రకాళి తన వర్గీయులతో పిడకలతో వేయించిందని, ప్రతి చర్యగా వీరభద్రస్వామి వర్గీయులు కూడా పిడకలు విసిరారనే పౌరాణిక ఘటన  ఇప్పటికీ ఈ ఊర్లో ఆనవాయితీగా కొనసాగుతోంది.

కైరుప్పల సమీప గ్రామమైన కారుమంచి గ్రామానికి చెందిన రెడ్డి వంశీకులు ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పిడకల సమరం ఆరంభమవుతుంది.

Updated Date - 2021-04-13T05:02:50+05:30 IST