LIGTHS ON : విద్యుత్ దీపాలతో జిగేల్‌మంటోన్న VICKY, KATRINA వివాహ వేదిక! viral pics

బాలీవుడ్‌కు విక్కీ, కత్రీనా వెడ్డింగ్ ఫీవర్ పట్టుకుంది. తాజాగా బీ-టౌన్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ మానవ్ మంగ్లానీ కొన్ని జిగేల్‌మనే ఫోటోలు నెటిజన్స్‌తో షేర్ చేశాడు. 

ఆయన జనం ముందుంచిన లెటెస్ట్ పిక్స్‌లో రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉన్న ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా’ రాజప్రాసాదం విద్యుత్ వెలుగుల్లో ధగధగలాడిపోయింది. 

కత్రీనా కళ్యాణం జరిగేది అక్కడే కావటంతో ఇప్పటికే రాజ్‌పుత్‌ల కాలం నాటి కోటకి సర్వాలంకారాలు పూర్తి చేశారు. అందులో భాగంగానే కళ్లు మిరిమిట్లు గొలిపేలా విద్యుత్ వెలుగులు ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా’ హోటల్‌ను బంగారు వర్ణంలో ముంచెత్తాయి! 

డిసెంబర్ 7 నుంచీ విక్కీ కౌశల్ పెళ్లి వేడుకలు జరుగుతాయి. కాగా బాలీవుడ్ హీరో కత్రీనా మెడలో తాళి కట్టేది డిసెంబర్ 9వ తేదీన. మొత్తం 120 మంది సెలబ్రిటీ గెస్టులు మాత్రమే బిగ్ బాలీవుడ్ వెడ్డింగ్‌కి హాజరుకానున్నారు...

Advertisement

Bollywoodమరిన్ని...